Crime News : ఆర్టీసీ బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు..! పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు - ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 26 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Macherla : పల్నాడు జిల్లా(Palnadu District) లింగంగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. స్థానిక బస్‌స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు(RTC Bus)-ఆటో(Auto) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. Also Read: ఇంట్లో చిచ్చు పెట్టిన రుద్రాణి.. నిప్పులు చెరుగుతున్న తోడికోడళ్ళు.. అల్లడిపోతున్న భర్తలు..! వేలూరు(Vellore) గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు అప్పాపురంలో మిర్చి కోతలకు ఆటోలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చిలకలూరిపేట వైపు వెళ్తోండగా.. ఈ క్రమంలోనే లింగంగుంట్ల బస్‌స్టాప్ వద్ద గణపవరం రోడ్డు నుంచి ఒక్కసారిగా ఆటో చిలకలూరిపేట రోడ్డులోకి వచ్చిందని.. ఇది గమనించిన ఆర్టీసీ డ్రైవర్ తప్పించే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. Also Read: పార్టీ కార్యకర్తలను జో కొట్టడానికే పవన్ ఇలా చేశాడు.. ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా: పేర్ని నాని ఆటో డ్రైవర్‌తో సహా క్షతగాత్రులైన 14 మంది కూలీలను చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. #andhra-pradesh #palnadu #rtc-bus #ap-crime #auto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి