తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..స్పాట్‌ లోనే ముగ్గురి మృతి!

కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్‌ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది.

తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం..స్పాట్‌ లోనే ముగ్గురి మృతి!
New Update

Road Accident in Anantapur : కొత్త కారు కొన్న అన్న సంతోషంలో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు ఓ వ్యక్తి . పార్టీలో ఫుల్‌ గా తాగారు. తిన్నారు. ఆ మత్తులో కారును నడపడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.

మరొకరికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Anantapur) జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి కొద్ది రోజుల క్రితం కొత్త కారు కొనుగోలు చేశాడు. దానికి రిజిస్ట్రేషన్ పనులు అన్ని పూర్తయిన తరువాత స్నేహితులకు పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే గురువారం కారుకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి.

దీంతో శుక్రవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి స్నేహితులకు విందు ఏర్పాటు చేశాడు. నలుగురు స్నేహితులు తెల్లవార్లు తాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం పార్టీ ముగించుకుని వస్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.

దీంతో ప్రమాద స్థలంలోనే కారు నడుపుతున్న మోహన్‌ రెడ్డితో పాటు విష్ణువర్ధన్‌ , నరేశ్‌ రెడ్డి మృతి చెందారు. మరో యువకుడు శ్రీనివాసరెడ్డి తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో నుంచి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాత్రి పార్టీలో మందు ఎక్కువగా తాగి కారును చాలా స్పీడుగా నడపడం వల్లే కారు అదుపు తప్పి రోడ్డు పక్కే ఉన్న చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహమ్మద్‌ గౌస్‌ పేర్కొన్నారు.

Also Read: పుంగనూరులో తీవ్ర ఉద్రిక్తత.. కాల్పులు జరిపిన పోలీసులు

#road-accident #crime-news #andhrapradesh #tadipatri #ananthpur #road-accident-in-anantapur
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe