Andhra Pradesh: ఛత్తీస్‌ఘడ్‌ జర్నలిస్టులపై కేసును పున:పరిశీలించాలి‌‌–హోంమంత్రి అనిత

ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు .దర్యాప్తుకు సంబంధించిన నివేదికను తనకు ఇవ్వాలని ఎస్పీని ఆమె కోరారు. సచివాలయంలో ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్ యూనియన్‌ నేతలతో సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

New Update
AP Home Minister Anitha: జగన్ పై చర్యలు.. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్!

Home Minister Anitha: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో బస్తర్‌‌లో నలుగురు ఛత్తీస్‌ఘడ్ జర్నలిస్టుల మీద చింతూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి నాలుగు రాష్ట్రాల జర్నలిస్టులు నిరసనలు చేశారు. మీడియా ప్రతినిధుల మీద నకిలీ కేసులు పెట్టారని వారు ఆరోపించారు. దీనిమీద ప్రభుత్వం విచారణ జరపాలని జర్నలిస్టులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. చింతూరు టీఐ పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని వారు కోరుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు నాయకులు కూడా అరెస్ట్‌ల మీద మళ్ళీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేలా ఎస్పీని ఆదేశించాలని కోరారు.

ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి అనిత.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జర్నలిస్టులపై చింతూరు పోలీసులు నమోదు చేసిన కేసును పునఃపరిశీలించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ నేతలు సమావేశమైన సందర్భంగా హోంమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. జరిగిన దానిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎస్పీ అల్లూరి సీతారామరాజును ఆదేశించారు. జర్నలిస్టులకు న్యాయం ,చేస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. మంత్రితో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ, సంఘం రాష్ట్ర నాయకుడు కృష్ణమోహన్, సెక్రటేరియట్ జర్నలిస్టులు సత్యనారాయణ, రామకృష్ణ, ప్రసన్నకుమార్ విజయ్, సురేంద్రతోపాటు పలువురు పాల్గొన్నారు.

Also Read: Kolkata Case : సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆందోళన విరమించిన ఎయిమ్స్ డాక్టర్లు!

Advertisment
Advertisment
తాజా కథనాలు