Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో ద్వారా సందేశాన్ని ఇచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే కూటమికి ఓటేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలకు దేశం బలౌతుందని అన్నారు.

New Update
Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి కూటమికే ఓటేయాలి..సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ఎంపీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ..రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని ఆయన అన్నారు. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారు...కానీ బీజేఈపీ అధికారంలోకి వస్తే అది లేకుండ పోతుందని రేవంత్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారు. కానీ రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది అని మండిపడ్డారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందని...అందుకే ఈసారి ప్రజలు కూటమికి ఓటు వేయాలని ఏవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

Also Read: రామ్‌చరణ్‌కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు

Advertisment
Advertisment
తాజా కథనాలు