AP Elections: రామ్‌చరణ్‌కు ఘనస్వాగతం పలికిన పిఠాపురం ప్రజలు కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యే పూజలు నిర్వహించేందుకు పిఠాపురం వచ్చిన రామ్‌చరణ్ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు మెగాహీరోను చూడ్డానికి ఎగబడ్డారు. By Manogna alamuru 11 May 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ram Charan At Pithapuram: ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం ప్రస్తుతం హాట్ సీటుగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తుండడంతో అందరి ఫోకస్ ఈ నియోజకవర్గంపైనే ఉంది. మరోవైపు పవన్ కు మద్దతుగా పిఠాపురానికి వచ్చారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖతో కలిసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో రాజమండ్రికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురానికి చేరుకున్నారు. చరణ్ తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అక్కడ స్థానిక కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అయితే రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్న విషయం మీద మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. This video brought smile on my face 😍 🥹🥛✊🏻❤️🔥#AbbaiForBabai #VoteForGlass #YuvasenaniForJanasenani #RamCharan #PawanakalyanForPitapuram #PawanakalyanWinningPithapuram pic.twitter.com/XV60nJi6KN — Lord Shiv🥛 (@lordshivom) May 11, 2024 ఎగబడ్డ జనాలు... మామూలుగాగానే పిఠాపురం ప్రజలు ప్రస్తుతం క్రేజీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మరింత ఉత్సాహంగా ఉన్నారు. దీనికి కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అక్కడకు రావడమే. మెగాహీరోను చూసేందుకు జనాలు తండోపతండాలుగా వచ్చారు. వారిని చూడ్డానికి వచ్చిన ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసుల వల్ల కాలేదు. కారు దగ్గర నుంచి రామ్ చరణ్‌ను తీసుకువెళ్ళడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. హీరోతో షే్ హ్యాండ్స్ ఇచ్చేందుకు, ఫోటోలు తీసుకునేందుకు పిఠాపురం ప్రజలు ఎగబడ్డారు. View this post on Instagram A post shared by Telugu FilmNagar (@telugufilmnagar) Also Read:Andhra Pradesh : ఏపీలో 4 కోట్ల 14 లక్షల 1,887 మంది ఓటర్లు #andhra-pradesh #rama-charan #ap-elections-2024 #pithapuram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి