RBI: దేశంలో అన్ని బ్యాంకులు నిబంధనలు పాటించాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా..ఆర్బీఐ కొరడా ఝలిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో బ్యాంకుల లైసెన్సులు కూడా రద్దు చేసింది. కొన్ని బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంది. మరికొన్ని బ్యాంకులకు కోట్లలో జరిమానా విధించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను బేఖాతర్ చేస్తే ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజాగా మరోమూడు ప్రముఖ బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్ సంస్థలపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా రూ. 3కోట్ల జరిమానా విధించినట్లు సోమవారం ప్రకటించింది ఆర్బిఐ. భారత్ లో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ పై కూడా ఆర్బీఐ అత్యధికంగా రూ. 2కోట్ల పెనాల్టీని విధించింది.
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇచ్చిన సమాచారంలో కెనరా బ్యాంక్ తదుపరి సవరణలను సరిదిద్దలేదని, ఈ తిరస్కరణను స్వీకరించిన ఏడు రోజులలోపు దానిని తిరిగి అప్‌లోడ్ చేయలేదని ఆర్‌బిఐ తన దర్యాప్తులో కనుగొంది. కానీ అవి బ్యాంక్ అంతర్గత నియంత్రణలు, పాలనకు సంబంధించినవి అని ఆర్బీఐ పేర్కొంది.
ఒడిశాలోని రూర్కెలాలో ఉన్న ఓషన్ క్యాపిటల్ మార్కెట్ లిమిటెడ్‌పై కూడా రూ.16 లక్షల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఎన్‌బిఎఫ్‌సి (Non-Banking Financial Companies)కి సంబంధించిన నిబంధనలను కంపెనీ పాటించడం లేదని ఆరోపించింది. రెగ్యులేటరీ స్క్రూటినీ తర్వాత ఆర్బీఐ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. రెగ్యులేటరీ విచారణలో లోపాలను గుర్తించిన తర్వాత ఈ జరిమానా విధిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ నిర్ణయాలు బ్యాంకు ఖాతాదారులపై ఎలాంటి ప్రభావం చూపవుని వెల్లడించింది.
అటు జనవరి 31న, నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా డిపాజిట్లు తీసుకోకుండా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. నిబంధనల ప్రకారం...పేమెంట్స్ బ్యాంక్ మార్చి 15 తర్వాత డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్ అప్ చేయకూడదు. నిన్న పేటీఎం పేమెంట్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుండి తన నామినీని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత విజయ్ శేఖర్ శర్మ బోర్డు సభ్యుని పదవికి కూడా రాజీనామా చేశారు.పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ భవిష్యత్తు వ్యాపారం ఇప్పుడు కొత్తగా ఏర్పడిన బోర్డు ద్వారా నిర్వహించనుంది.
ఇది కూడా చదవండి: రైతన్నలకు శుభవార్త…రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!