TS News: నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు..అసలు కారణం ఇదే.! రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన నలుగురు బలవన్మరణంకు సంబంధించి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. 25లక్షలు కావాలని నలుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు బ్లాక్ మెయిల్ చేయడంతోనే రవి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. By Bhoomi 13 Mar 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి TS News: రంగారెడ్డి జిల్లా టంగటూరు విషాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. నీరటి రవి అనే ప్రైవేట్ ఉద్యోగి తన ముగ్గురు కుమారులు సాయికిరణ్, మోహిత్ కుమార్, ఉదయ్ కిరణ్ అందరూ 13ఏండ్లలోపు పిల్లలు. వారిని చంపేసి అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. మృతుని భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. రవి అనే వ్యక్తి నలుగురు రిపోర్టర్లు, ఒక హోం గార్డు 25లక్షల కావాలని బెదిరించి బ్లాక్ మెయిల్ చేయడంతోనే తన కుమారులను చంపి తాను బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురి మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించారు. వీరిలో నలుగురు రిపోర్టులు..ఒక హోంగార్డు ఉన్నారు. గొలుసుకట్ట స్కాంలో చిక్కుకున్న రవి అప్పులు ఇచ్చినవాళ్లు ఇంటికి రావడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఏ1 - తిరుపతి రావు. ఏ2 - మంగలి శ్రీనివాస్ ఏ3 - కురుమ శ్రీనివాస్ ఏ4 - వడ్డే మహేష్ - ఏ5 - సిరిపురం శ్రీనివాస్ రెడ్డి ఏ6 - సంకే ప్రవీణ్ కుమార్ ఏ7 - ఆలూరు రాజు. ఏ8 - మనీలా ఏ9 - రామకృష్ణలని పోలీసులు తెలిపారు. 25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసి నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా… pic.twitter.com/uX41aHwRFI — Telugu Scribe (@TeluguScribe) March 13, 2024 ఇది కూడా చదవండి: రాహుల్కు షాక్..మళ్లీ మోదీకే పట్టం..నరేంద్రుడినే కోరుకుంటోన్న దేశం..! Your browser does not support the video tag. #murder #tangutur-village #sons #reporters #ranga-reddy-dist #father-killing-three-sons #telangana-police #father మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి