IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్‌!

దక్షిణాఫ్రికాపై రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ టెస్టుకు టీమిండియాలో పలు మార్పులు సూచించాడు లెజెండరీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్. తొలి టెస్టులో ఆడిన అశ్విన్‌, ప్రసిద్ కృష్ణ స్థానంలో జడేజా, ముఖేశ్‌ కుమార్‌ను ఆడించాలని చెప్పాడు.

New Update
IND VS SA: ఆ ఇద్దరుని పక్కన పెట్టండి.. ఈ ఇద్దరికి ఛాన్స్ ఇవ్వండి.. రెండో టెస్టుకు సన్నీ సజెషన్‌!

మొదటి టెస్టు ఘోరంగా ఓడిపోయాం. ఇన్నింగ్స్‌ తేడాతో పరాజయం మూటగట్టుకున్నాం. అది చేస్తాం.. ఇది చేస్తాం అని దక్షిణాఫ్రికా(South Africa) ఫ్లైట్ ఎక్కిన భారత్ ప్లేయర్లు టీ20, వన్డే సిరీస్‌లలో రాణించారు కానీ.. అసలుసిసలైన టెస్టు సిరీస్‌లో మాత్రం తొలి టెస్టును దారుణంగా ప్రారంభించారు. 31ఏళ్ల నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌ ఎప్పుడూ కూడా టెస్టు సిరీస్‌ విజయం సాధించలేదు. ఈ సారైనా ఆ ఫేట్ మారుతుందని ఫ్యాన్స్‌ భావించగా.. టీమిండియా నిరాశ పరిచింది. ఇక ఆఖరిదైన రెండో టెస్టు జనవరి 3 నుంచి ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులు చేయాలని టీమిండియా లెజెండరీ క్రికెటర్‌ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) సూచించారు.

జడేజాను తీసుకురావాలి:
దక్షిణాఫ్రికా పిచ్‌లు సాధారణంగా పేసర్లకు అనుకూలిస్తాయి. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగింది. టెస్టుల్లో నంబర్‌-1 బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin)ని ఆడించింది. అతను పర్వాలేదనిపించాడు. అయితే అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja)ను ఆడించాలని సునీల్ గవాస్కర్‌ చెబుతున్నాడు. అంతే కాదు ఫార్మెట్‌తో సంబంధం లేదకుండా భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పేసర్ ప్రసిద్ కృష్ణను తప్పించాలంటున్నాడు. అతని స్థానంలో ముఖేశ్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వాలని చెబుతున్నాడు. నిజానికి జడేజా గాయంతో బాధపడుతున్నాడు. మొదటి టెస్టు ప్రారంభానికి ముందు వెన్నుముకపై నొప్పితో బాధపడుతూ ఆ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

అటు సన్నీ వ్యాఖ్యలతో మాజీ పేసర్‌ ఇర్ఫాన్ పఠాన్‌ ఏకీభవించాడు. ముఖేశ్‌ కుమార్ వెస్టిండీస్‌పై వెస్టిండీస్‌తో ఒకే ఒక టెస్టు ఆడాడు. అక్కడ పిచ్‌పై అతను రెండు వికెట్లు పడగొట్టాడు.40 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 151 వికెట్లను కలిగి ఉన్నాడు. ఇందులో ఆరు ఫైఫర్‌లు ఉన్నాయి. 30 ఏళ్ల ముఖేశ్‌ దక్షిణాఫ్రికాలో జరిగిన రెండు టీ20లలో మూడు వికెట్లు తీశాడు. మూడు వన్డేల్లో ఒక వికెట్ మాత్రమే తీశాడు. ఇక సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియాపై ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రోటీస్ ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల రెడ్-బాల్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

Also Read: నీళ్లు తాగుతూ కుప్పకూలిన క్రికెటర్‌.. చిన్నవయసులోనే ఊహించని మరణం!

WATCH:

Advertisment
తాజా కథనాలు