Food Delivery Time Bound: తెలుగు రాష్ట్రాలను వర్షాలను పట్టి కుదిపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆగకుండ పడుతూనే ఉన్నాయి. దీని వల్ల చాలా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజులు ఇలాగే వాతావరణం ఇలాఏ ఉంటుందని చెబుతోంది ఐఎండీ. మరికొన్ని రోజులు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పుడ్ డెలివరీ యాప్‌లకు మ్ రిస్ట్రిక్షన్ తీసేయాలని కోరుతున్నారు వర్కర్లు. ప్రస్తుత పరిస్థితుల్లో టైమ్‌కు ఉడ్ డెలివరీ చేయాలంటే కష్టంగా ఉందని వారు చెబుతున్నారు. అలా చేయకపోతే కస్టమర్లు దాడులు చేస్తున్న సంఘటనలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ డెలివరీ, రైడింగ్ సర్వీసులపై తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ ఆందోళన వక్తం చేసింది. సమయానికి డెలివరీ చేయాలనే నిభందనను తీసేయాలని ఆయా కంపెనీలను డిమాండ్ చేసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా సమయానికి రాలేరని తెలిపింది.
స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, జెప్టో, బాగ్ బాస్కెట్ లాంటి డెలివరీ ఫ్లాట్ ఫామ్‌లు అన్నింటిలో సమానుకూలంగా డెలివరీ అవసరాలను తొలగించాలని..వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సర్ ఛార్జ్‌లను ప్రవేశ పెట్టాలని వర్కర్స్ యూనిన్ కోరింది. దీంతో పాటూ డెలవరీ బాయ్స్‌కు రెయిన్ కోట్లు, ఫోన్ కవర్లు, పవర్ బ్యాంక్‌ల్లాంటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఉబర్, ఓలా, రాపిడో సర్ఈసుల్లో వరదల వల్ల దెబ్బ తిన్న కార్లకు రిపేర్ల కోసం లక్షరూపాలను అందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అత్యవర ఆదేశాలను జారీ చేయాలని వర్కర్ల యూనియన్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
Also Read: Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు నారా భువనేశ్వరి భారీ విరాళం