/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
Donald Trump : పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఊరట లభించింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై విరుచుకుపడుతుండగా ఇరాన్ అదే స్థాయిలో తిప్పికొడుతుంది. ఈ సమయంలో ఇరాన్‌పై యుద్ధంలో కాంగ్రెస్ అనుమతి లేకుండా బలగాలను రంగంలోకి దించకూడదని సెనెట్ లో విపక్షాలు చేసిన తీర్మానం వీగిపోయింది.53-47 ఓట్ల తేడాతో ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో ట్రంప్ చేపట్టిన సైనిక చర్యకు సెనెట్ మద్ధతు లభించినట్లయింది.
Also Read : నాటో దేశాలపై తొలి దాడి.. తుర్కియేపై బాలిస్టిక్ క్షిపణి అటాక్
Relief For Trump
అయితే ఇరాన్(iran us war) పై ట్రంప్ చేపట్టిన సైనిక చర్యను అడ్డుకోవడంతో పాటు ట్రంప్ అధికారాలను పరిమితం చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు సెనెట్(senetor) లో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. డెమోక్రటిక్ సభ్యుడు టిమ్ కైన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దీనికి ఆమోదం లభించలేదు. ట్రంప్ సైనిక చర్యకు మద్దతుగా 53 మంది ఓటు వేశారు. దానికి వ్యతిరేకంగా 47 మంది ఓటు వేశారు. దీంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానం వీగిపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు లభించినట్లయింది. కాగా ఈ తీర్మానానికి అనుకూలంగా రిపబ్లికన్ సభ్యుడు రాండ్ పాల్ ఓటు వేయగా, వ్యతిరేకంగా డెమోక్రటిక్ సభ్యుడు జాన్ ఫెట్టర్‌మాన్ ఓటు వేయడం గమనార్హం. - america attacks iran
Also Read : పాక్, అఫ్గాన్ మధ్య భీకర యుద్ధం... బాగ్రామ్ ఎయిర్‌బేస్‌పై పాక్ దాడి
Follow Us