Pakistan vs Afghanistan : పాక్‌, అఫ్గాన్‌ మధ్య భీకర యుద్ధం...బాగ్రామ్‌ ఎయిర్‌బేస్‌పై పాక్‌ దాడి

అఫ్గానిస్థాన్- పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య సాగుతున్న పోరాటంలో వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు.

New Update
FotoJet (10)

Fierce fighting between Pakistan and Afghanistan.

Pakistan vs Afghanistan : అఫ్గానిస్థాన్-పాకిస్తాన్(pakistan vs afghanistan war) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య సాగుతున్న పోరాటంలో వందలాది మంది నిరాశ్రయులవుతున్నారు. పదుల సంఖ్యలో ఇరు దేశాల పౌరులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.అఫ్గానిస్తాన్‌  నుంచి తమ దేశంపై జరుగుతున్న ఉగ్ర దాడులను అరికట్టడంలో తాలిబన్లు(pakistan vs afghanistan and taliban) విఫలమయ్యారని పాక్‌ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26 నుంచి ‘ఆపరేషన్‌ ఘజబ్‌ లిల్‌ హక్‌’ పేరుతో పాక్‌ భారీ సైనిక చర్యకు దిగింది. ఈ ఘర్షణలు చిలికిచిలికి గాలివానగా మారి వైమానికి దాడులకు దారితీసింది. అందులో భాగంగా అఫ్గానిస్థాన్‌లోని వ్యూహాత్మక బాగ్రామ్‌ వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ దాడులు నిర్వహించింది.  

Also Read :  ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి.. మిగతా కుటుంబం ఎక్కడ?

Fierce Fighting Between Pakistan And Afghanistan

పాకిస్తాన్ భద్రతా దళాలు రాత్రిపూట ఒక్కసారిగా జరిపిన ఆపరేషన్లలో 67 మంది అప్గాన్ తాలిబాన్ సిబ్బంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య ఉన్న సుమారు 2600 కిలోమీటర్ల సరిహద్దు వెంబడి 53 ప్రాంతాల్లో అఫ్గాన్‌ తాలిబన్లు దాడులకు పాల్పడినట్లు పాకిస్తాన్ ఆరోపించింది. దీంతో రెచ్చిపోయిన పాక్‌ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాక్, అప్గాన్ సరిహద్దులోని 16 ప్రదేశాల్లో తాలిబన్ల దాడులను తిప్పికొట్టామని పాక్‌  అధికారులు తెలిపారు.  ఈ దాడిలో బాగ్రామ్‌ ఎయిర్‌బేస్‌లోని ఒక ఎయిర్‌ క్రాఫ్ట్‌ హ్యాంగర్‌, రెండు గిడ్డంగులు ధ్వంసమైనట్లు తెలిపింది. - pakistan-vs-afghanistan

Also Read :  యుద్ధంలో రూ.18.87 లక్షల కోట్లు నష్టం.. ట్రంప్‌పై అమెరికా ప్రజలు ఫైర్

ఇరుదేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం అఫ్గానిస్థాన్‌లోని పలు ప్రాంతాల నుండి సుమారు 20,000 కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లినట్లు తెలిసింది. ఈ హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు కనీసం 42 మంది పౌరులు మరణించగా, 104 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు సైతం ఉన్నారని ఐరాస తెలిపింది. కాగా ఇప్పటికే తీవ్ర పోషకాహార లోపంతో కొట్టుమిట్టాడుతున్న ఈ ప్రాంతాల్లోని పౌరులు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతుండగా తాజాగా నెలకొన్న యుద్ధం కారణంగా  ఆ ప్రాంతాల్లో అత్యవసర అహార పంపిణీ నిలిచిపోయింది. దీంతో సుమారు 1.6 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) హెచ్చరించింది. కాగా ఈ సైనిక చర్య మూలంగా ఇరుదేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.  అఫ్గాన్ సైన్యం తమ వైపు 25 మంది సైనికులు వీరమరణం పొందారని ప్రకటించింది. అదే సమయంలో  సుమారు 150 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు