Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు

నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్‌ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది.

New Update
Stock Market Today: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు తీస్తున్న ఇండెక్స్ లు..

Reliance Shares : ఈరోజు దేశీ మార్కెట్లో(Stock Market) ట్రేడింగ్ మొదలు అవుతూనే ఇండెక్స్ లు లాభాల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం సెన్సెక్స్(Sensex) 180 పాయింట్లకు పైగా లాభంతో 72,650 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ(Nifty) కూడా 61 పాయింట్లకు పైగా పెరిగింది. 22,066 స్థాయిలో ట్రేడవుతోంది. భారత్ స్టాక్ మార్కెట్ మాత్రమే కాకుండా ఆసియా మార్కెట్లు కూడా ఈరోజు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నిక్కీ 0.46 శాతం లాభపడగా, టో పాక్స్ 1 శాతం వరకూ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ చమురు ధర 85.51 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక డాలరుతో పొలిస్తే రూపాయి మారకం విలువ 83.31 దగ్గర ప్రారంభమైంది.

ఈరోజు ట్రేడింగ్(Trading) ప్రారంభంలో అత్యధికంగా లాభాలు చూస్తున్న కంపెనీలలో రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, మారుతీ, ఎస్‌బీఐ, టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌ షేర్లు ఉండగా...నెస్లే ఇండియా, ఎం అండ్‌ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

 పరుగెడుతున్న రిలయన్స్ షేర్లు..

ఇక గోట్డ్ మన్ సాచ్స్ బుల్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీ షేర్ల(Reliance Industries Shares) ధర బాగా పెరగవచ్చని తెలుస్తోంది. వీటిల్లో 54 శాతం ఎదుగుదల కనిపించవచ్చని చెబుతున్నారు. గోల్డ్ మన్ సాచ్స్ అంచనా ఆధారంగా ఆర్ధి సంవత్సరం నాటికి నిఫ్టీ 50 హెవీ వెయిట్ షేరు ధర 4,495 రూ. లకు చేరుతుందని అంటున్నారు. ఈ బుల్ జోరు 2026 వరకు కొనసాగుతుందని చెబుతున్నారు. ఇక రిలయన్స్‌కు బై రేటింగ్ ఇచ్చింది గోల్డ్‌మన్ సాచ్స్. షార్ట్ టర్మ్‌లో టార్గెట్ ప్రైస్ రూ. 3400 వరకు వెళ్తుందని చెప్పింది. ఇది ప్రస్తుత ధరతో చూస్తే 17 శాతం ఎక్కువే. రిలయన్స్- డిస్నీ విలీనం వంటి అంశాలు స్టాక్ పుంజుకునేందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీ షేరు .250 శాతం పెరిగి 2955 రూ. దగ్గర కొనసాగుతోంది. ఇంట్రడేలో 2958రూ. దగ్గర గర్షటాన్ని నమోదు చేసింది.

Also Read : International:మోదీకి మద్దతిచ్చిన సత్యం సురానా..యూనివర్శిటీలో వేధింపులు

Advertisment
Advertisment
తాజా కథనాలు