Nellore Cow: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు..

ఏపీలోని నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవుకు బ్రెజిల్‌లో భారీ ధర పలికింది. వయాటినా–19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.

Nellore Cow: రూ.40 కోట్లకు అమ్ముడుపోయిన నెల్లూరు జాతి ఆవు..
New Update

Nellore Cow Sold for 40 Crores: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ఒంగోలు మేలు రకానికి చెందిన ఆవులంటే చాలా ఫేమస్. ఈ జాతుల ఆవులకు భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు బ్రెజిల్‌లో (Brazil) భారీ ధర పలికింది. వయాటినా – 19 ఎఫ్‌ఐవీ మారా ఇమోవిస్‌ అని పిలిచే ఈ నెల్లూరు జాతి ఆవు 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు అమ్ముడైపోయింది. మన కరెన్సీలో దీని విలువ రూ. 40 కోట్లు.

Also Read: వంతెన ప్రమాదం ఘటన.. భారత సిబ్బందిని ప్రశంసించిన బైడెన్

భారతదేశానికి చెందిన ఈ మేలుజాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా ప్రసిద్ధికెక్కింది. ఈ జాతి ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు తరలించారు. అప్పటినుంచి ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ ఉంది. ఇలాంటి ఆవులు ఒక్క బ్రెజిల్‌లోనే 1.60 కోట్ల ఆవులు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.

Also Read: భార్యను సెకండ్ హ్యాండ్ అన్న భర్త.. షాకిచ్చిన హైకోర్టు.. ఫైన్ ఎంతంటే?

#telugu-news #brazil #nellore-cow
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe