Joe Biden: వంతెన ప్రమాదం ఘటన.. భారత సిబ్బందిని ప్రశంసించిన బైడెన్ అమెరికాలోని బాల్టిమోర్‌లో వంతెన కూలిన ప్రమాదంపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసలు కురించారు. సిబ్బంది అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని అన్నారు. మళ్లీ ఆ వంతెనను నిర్మిస్తామని తెలిపారు. By B Aravind 27 Mar 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Baltimore Bridge Accident: అమెరికాలోని బాల్టిమోర్‌లో పటాప్ స్కో నదిపై రవాణా సరుకు నౌక వంతెనను ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆ వంతెన సెకండ్లలోనే కుప్పకూలింది. అయితే ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఆ నౌకలో ఉన్న భారత సిబ్బందిపై, అలాగే సహాయక సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. 'నదిలో వెళ్తుండగా.. షిప్ నియంత్రణ కోల్పోయింది. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే స్పందింది.. మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటికి సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక అధికారులు ఆ వంతెన రాకపోకలను నిలిపివేయగలిగారు. వీళ్ల అప్రమత్తత ఎన్నో ప్రాణాలను కాపాడిందని' జో బైడెన్ అన్నారు. Also Read: నా భర్త ‘లిక్కర్ స్కామ్’ నిజాలు రేపు కోర్టుకు చెబుతారు: సునీత మళ్లీ వంతెన నిర్మిస్తాం అలాగే ఘటనాస్థలంలో సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఎమర్జెన్సీ సమయంలో అన్ని వనరులు అందుబాటులో ఉంచామని.. తమ ప్రభుత్వం వెంటనే వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు బైడెన్ తెలిపారు. ఇదిలాఉండగా బాల్డిమోర్లోని.. సింగపూర్ జెండాతో 'డాలీ' అనే నౌక శ్రీలంక రాజధాని కోలంబోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నౌక పటాప్ స్కో నదిపై వెళ్తుండగా నియంత్రణ కోల్పోయింది. సిబ్బంది అప్రమత్తత దీంతో ఆ నౌక ఆ నదిపై నిర్మించిన వంతెనను ఢీకొంది. ఈ ప్రభావానికి ఆ వంతెన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఆ వంతెనపై వెళ్తున్న కొన్ని వాహనాలు కూడా నీటిలో పడిపోయాయి. ఈ ప్రమాదం జరగడానికి ముందు.. నౌక నియంత్రణ కోల్పోయిన వెంటనే అందులో ఉన్న సిబ్బంది మేరీలాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ వంతన పైకి వెళ్లబోయే వాహనాలను ఆపేశారు. రాత్రి సమయంలో ఈ వంతెనపై చాలా తక్కువగా వాహనా సంచారం ఉండటం వల్ల ప్రాణనష్టం అంతగా జరగలేదు. ఒకవేళ మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే.. వందలాది వాహనాలు ఆ నదిలో పడిపోయేవి. అయితే ఈ ప్రమాదంలో ఆరుగులు చనిపోయినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రవాణా సరుకు నౌకను మెర్క్స్ షిప్పింగ్ అనే కంపెనీ అద్దెకు తీసుకుంది. ఈ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారని.. వీళ్లందరూ కూడా భారతీయులేనని కంపెనీ తెలిపింది. ప్రమాదం జరిగినప్పటికీ వీళ్లెవరికి గాయాలు కాలేదని పేర్కొంది. BREAKING: Ship collides with Francis Scott Key Bridge in Baltimore, causing it to collapse pic.twitter.com/OcOrSjOCRn — BNO News (@BNONews) March 26, 2024 Also Read: కవితకు ఖైదీ నంబర్ 666.. డల్‌గా మొదటిరోజు #telugu-news #ship-accident #joe-biden #baltimore-bridge-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి