రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటేనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో ఐదు కోఆపరేటీవ్ బ్యాంకులపై కొరడ ఝళిపించింది. ఆ బ్యాంకుల్లో నియంత్రణ లోపాలు గుర్తించిన నేపథ్యంలో భారీ పెనాల్టీని విధించింది. ది పటాన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పుణె మున్సిపల్ కార్పొరేషన్ సర్వెంట్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఇందాపుర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పుణె మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, జనకల్యాణ్ సహకారి బ్యాంక్ .. ఈ ఐదు బ్యాంకులకు ఫైన్ వేసింది. అయితే ఈ సహకార బ్యాంకులపై ఫైన్ విధించినప్పటికీ ఇతర ఆంక్షలు కూడా ఉంటాయి. దీనివల్ల వినియోగదారులకు ఈ బ్యాంకుల నుంచి అన్ని రకాల సేవలు ఉండవు.
Also read: రాజస్థాన్‌లో ఈరోజు భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం..
అందుకే ఈ బ్యాంకుల్లే అకౌంట్లు తీసుకోవాలనుకుంటే లేదా డిపాజిట్లు చేసేవారు పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మార్గదర్శకాలు పాటించనందుకు జనకల్యాణ్ సహకారి బ్యాంక్‌కు రూ.5 లక్షలు విధించారు. పుణే మర్చంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.1 లక్ష, ఇందాపుర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.5 లక్షలు, ది పటాన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌కు రూ.2 లక్షలు, పుణె మున్సిపల్ కార్పొరేషన్ సర్వెంట్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు రూ. లక్ష విధించింది ఆర్బీఐ.
అయితే చాలావరకు సహాకార బ్యాంకులపైనే ఆర్బీఐ చర్యలు తీసుకుంటోంది. అందుకే ఇలాంటి బ్యాంకుల్లో అకౌంట్లు తీసుకునేముందు ముందుగా అన్ని విషయాలు పరిశీలించుకోవాలని అధికారులు చెబుతున్నారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద బ్యాంక్ లైసేన్స్ రద్దు అయినట్లైతే రూ.5 లక్షల వరకు మాత్రమే డబ్బులు వస్తాయని అంటున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా ఆయా బ్యాంకులపై కేవలం ఫైన్‌లు విధించినప్పటికీ.. ఒకవేళ సమస్య తీవ్రతరమైతే బ్యాంకు లైసెన్సు కూడా రద్దు చేయాల్సి వస్తుందని పేర్కొంది.