Ravi Prakash: రవి ప్రకాష్ స్ఫూర్తితో వరద బాధితులకు సాయం!

తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో వారికి సాయం అందించేందుకు కడప జిల్లా వాసులు ముందుకు తరలివచ్చారు. వారు అలా రావడానికి కారణం రవి ప్రకాష్‌ అని తెలిపారు. 2009 లో కర్నూలు వరదల సమయంలో కూడా ఇలానే రవిప్రకాష్‌ స్ఫూర్తితో సహాయక కార్యక్రమాలు చేసినట్లు వారు వివరించారు.

Ravi Prakash: రవి ప్రకాష్ స్ఫూర్తితో వరద బాధితులకు సాయం!
New Update

Ravi Prakash: తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకునేందుకు కడప జిల్లా వాసులు కదిలి వచ్చారు. 2009 లో కర్నూలు వరదల సమయంలో కూడా రవి ప్రకాష్‌ స్ఫూర్తితో ఆనాడు వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అప్పటి స్ఫూర్తితో అజిత్ సింగ్‌ నగర్‌ లో వేలమందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా కొందరు కడప వాసులు మీడియాతో మాట్లాడుతూ..2009 లో రవిప్రకాష్‌ తో కలిసి మేము వరద బాధితులను ఆదుకున్నామని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోనే స్వచ్ఛందంగా సొంత డబ్బులతో వరద బాధితులకు ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు.

ఆయన ఇచ్చిన స్ఫూర్తి మమ్మల్ని చాలా ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసిందని తెలిపారు.

Also Read: వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం

#vijayawada #vijayawada-floods #andhra-pradesh-floods #singh-nagar #kadapa #ravi-prakash
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe