ఐదు జిల్లాలకు భారీ వర్షాలు
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు.
బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వివరించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ కు మరో వానగండం వార్తని వాతావరణశాఖ మోసుకొచ్చింది. మరో వారం రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు.
AP: ఈరోజు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
బుడమేరు వరదల్లో విజయవాడలో సర్వం కోల్పోయిన వారి పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. వారిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులను అర్బన్ కంపెనీ యాప్ తో ఇంటివద్దనే మరమత్తులు జరిపించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ఆహారం,నీళ్లు అందడం లేదని వీఆర్వో విజయలక్ష్మిని వరద బాధితులు నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం నెలకొనగా..సహనం కోల్పోయిన వీఆర్వో యాసిన్ అనే బాధితుడి పై చేయి చేసుకున్నారు. ఈ విషయం కలెక్టర్ కి తెలియడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బుడమేరుకు ఆకస్మిక వరదలు రావొచ్చని విజయవాడ నీటిపారుదల విభాగం ఎస్ఈ ఆదివారం అర్ధరాత్రి తెలిపారు.ఇప్పటికే నీటిమట్టం ఓ అడుగు పెరిగిందని తెలిపారు.
ఏపీకి మరోసారి వానగండం పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.దీని ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరికలు జారీ చేశారు.