Rashmika Mandanna : "నా ఎన్నో ఏళ్ల కల నెరవేరింది".. వైరలవుతున్న రష్మిక పోస్ట్

జపాన్ లోని ఓ అవార్డు కార్యక్రమానికి వెళ్లిన స్టార్ హీరోయిన్ రష్మిక.. "నా చిన్నప్పటి కల నెరవేరింది" అంటూ చేసిన పోస్ట్ వైరలవుతోంది. "చాలా ఏళ్లుగా నేను వెళ్లాలని కలలు కంటున్న ప్రదేశం జపాన్. చిన్నప్పటి నుంచి ఇది సాధ్యమవుతుందని అనుకోలేదు" అని రాసుకొచ్చింది.

Rashmika Mandanna : "నా ఎన్నో ఏళ్ల కల నెరవేరింది".. వైరలవుతున్న రష్మిక పోస్ట్
New Update

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక(National Crush Rashmika) ప్రస్తుతం ‘పుష్ప 2’(Pushpa 2) మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. యానిమల్(Animal) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని ఫుల్ జోష్ తో దూసుకెళ్తోంది రష్మిక. ఇటు బాలీవుడ్, టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. తన, నటన గ్లామర్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ నేషనల్ క్రష్.

Manchu Manoj : “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్

అయితే ఇటీవలే ఈ బ్యూటీ టోక్యో(Tokyo) లోని ‘క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో’(Crunchyroll Anime Awards) పాల్గొనేందుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు వేడుకలో ఇండియాను రిప్రజెంట్ చేసింది రష్మిక(Rashmika). ఈ క్రమంలో జపాన్ వెళ్లిన రష్మిక.. "నా చిన్నప్పటి కల నెరవేరింది" అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Rashmika Mandanna

రష్మిక ఇన్స్టాగ్రామ్ పోస్ట్

"నేను చాలా ఏళ్లుగా వెళ్లాలని కలలు కంటున్న ప్రదేశం జపాన్(Japan). చిన్నప్పటి నుంచి ఇది సాధ్యమవుతుందని ఎప్పుడూ అనుకోలేదు. "అనిమీ అవార్డ్స్ " వేడుకల్లో భాగమై ఒకరికి అవార్డు అందజేయడం సంతోషంగా ఉంది. చివరికి నా కల నిజమైంది. ఇక్కడ ప్రతీ ఒక్కరినీ కలుసుకోవడం, వారి అపురూపమైన ప్రేమను పొందడం, ఇంతటి ఘన స్వాగతాన్ని అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడి వాతావరణం, ఫుడ్, మనుషులు, వారు చూపించే ప్రేమ అద్భుతంగా ఉన్నాయి. జపాన్ నాకు చాలా స్పెషల్ ప్లేస్.. ఐ లవ్ యూ జపాన్. ఇక నుంచి ప్రతీ సంవత్సరం జపాన్ వస్తూనే ఉంటాను అని రాసుకొచ్చింది."

Also Read : Ram Charan-NTR: హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రామ్ – భీమ్.. ఇద్దర్నీ ఒకే చోట చూసి ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..?

#rashmika-mandanna #japan #tokyo #rashmika-childhood-dream
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe