Bhuma Mounika Emotional Post: టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj), రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక గతేడాది ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ 2023 లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్ (Dhairav) అనే కుమారుడు ఉన్నాడు. భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. ధైరవ్ ను కూడా సొంత కొడుకులా చూసుకుంటున్నారు. అయితే నేడు మౌనిక, మనోజ్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా భర్త మనోజ్ కు బ్యూటిఫుల్ విషెస్ తెలియజేసింది భూమా మౌనిక.
పూర్తిగా చదవండి..Manchu Manoj: “నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్”.. భూమా మౌనిక ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, భూమా మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు వారి పెళ్లిరోజు సందర్భంగా..తాము కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ భర్తకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపింది మౌనిక. "నీ హృదయంలో నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్" అంటూ పోస్ట్ పెట్టింది.
Translate this News: