Iran: ఒకేసారి మూడు శాటిలైట్లను నింగిలోకి పంపించిన ఇరాన్.. ఇరాన్ ఆదివారం రోజున ఓకేసారి మూడు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ, అలాగే కమ్యూనికేషన్లలను పరీక్షించనున్నారు. By B Aravind 28 Jan 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఇరాన్ సాంకేతిక రంగంలో తన సత్తాను కూడా చూపించింది. ఆదివారం రోజు ఒకేసారి మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. తమ దేశంలోనే అభివృద్ధి చేసిన సిమోర్గ్ రాకెట్ వాటిని 450 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి తీసుకెళ్లింది. అయితే నింగిలోకి పంపిన వాటిలో ఒక ఉపగ్రహం 35 కిలోలు ఉంది. ఇక మిగిలిన రెండు ఉపగ్రహాలు 10 కిలోల లోపు బరువున్నాయి. వీటితో జియో పొజిషనింగ్ టెక్నాలజీ, అలాగే కమ్యూనికేషన్లలను పరీక్షించనున్నారు. Also Read: మోదీ సర్కార్ కీలక ప్రకటన…లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!! అమెరికా, ఐరోపా ఆందోళన ఈ మూడు శాటిలైట్లలో పెద్దదాన్ని 'మహ్ద' గా.. అలాగే మిగిలిన రెండింటిని కహ్యాన్-2, హతేఫ్-1 అని వ్యవహరిస్తున్నారు. ఈ ఉపగ్రహాలను ఇరాన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. వివిధ రకాల పేలోడ్‌లను అంతరిక్షంలోకి చేర్చడంలో సిమోర్గ్ రాకెట్ కచ్చితత్వాన్ని పరీక్షించారు. ఈ నెలలోనే ఇరాన్ సొరయా అనే 50 కిలోల బరువున్న శాటిలైట్‌ను ఏకంగా 750 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి పంపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇరాన్‌కు చెందిన సైనిక విభాగమైన ఐఆర్‌జీసీ తయారు చేయడంతో.. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ ప్రయోగంపై ఆందోళన నెలకొంది. శాంతియుత అభివృద్ధిని సాధించేందుకే ఇలాంటి టెక్నాలజీనే దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల్లో కూడా వినియోగిస్తుందని అమెరికా, యూరప్‌లు ఆరోపించాయి. దీంతో కొన్ని దేశాలను ఇరాన్‌ను చర్యను ఖండించగా.. తాము శాంతియుత అభివృద్ధిని సాధించేందుకే వీటిని వినియోగిస్తామమని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే ఇరాన్ జరిపిన తాజా ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను అక్కడి ప్రభుత్వ టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేశారు. మరో విషయం ఏంటంటే సిమోర్గ్ రాకెట్ ప్రాజెక్టులో గతంలో చేసిన ఐదు ప్రయోగాలు కూడా విఫలమయ్యాయి. Also Read: అత్యంత ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. ఫస్ట్ ఎవరంటే #telugu-news #iran #satellites #iran-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి