Ram charan: చరణ్‌ కు మరో అరుదైన గౌరవం..ఆస్కార్‌ మెంబర్‌ లిస్ట్ లో చెర్రీ పేరు!

ఆస్కార్‌ అకాడమీలో యాక్టర్స్‌ బ్రాంచ్‌ లో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా చేరిపోయాడు.జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ విషయం తెలియడంతో అటు మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చరణ్‌ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

New Update
Ram charan: చరణ్‌ కు మరో అరుదైన గౌరవం..ఆస్కార్‌ మెంబర్‌ లిస్ట్ లో చెర్రీ పేరు!

మెగాస్టార్‌ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ నటనలో తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు రామ్‌ చరణ్‌. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో అంతర్జాతీయంగా కూడా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటతో తెలుగు చిత్ర పరిశ్రమకి ఆస్కార్‌ ని పట్టుకొచ్చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆస్కార్‌ అకాడమీలో యాక్టర్స్‌ బ్రాంచ్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇప్పటికే స్థానం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే.తాజాగా మెగా ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగే విషయం ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటి అంటే..ఈ లిస్టులోకి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా చేరిపోయాడు.

publive-image

Also read: నేను హాజరు కాను..వెంటనే సమన్లు వెనక్కి తీసుకోండి: కేజ్రీవాల్‌!

చరణ్‌ తో పాటు మరో 7 గురు నటులను కూడా ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌ లో చేర్చుకున్నారు. ఈ విషయం తెలియడంతో అటు మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చరణ్‌ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, జ‌య‌రాయ్‌, సునీల్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రాన్ని దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదల అవుతుంది. చరణ్‌ ప్రస్తుతం వరుణ్‌ తేజ్ పెళ్లికోసం ఇటలీలో పర్యటిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు