Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం

ఈరోజు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి రాజ్యసభ ఎంపీల ఎంపిక జరగనుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 5 తరువాత ఓట్ల కౌంటింగ్ మొదలు అవుతుంది. ఇందులో 12 రాష్ట్రాల ఎంపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

New Update
Rajya Sabha: రాజ్యసభలో పోలింగ్ మొదలు ..12 రాష్ట్రాల అభ్యర్ధులు ఏకగ్రీవం

MP Elections: రాజ్యసభలో ఈరోజు కొత్త ఎంపీలను ఎన్నుకోబోతున్నారు. 15 రాష్ట్రాలకు చెందిన ఎంపీల కోసం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్...ఆ తరువాత కౌంటింగ్ ఉంటాయి. మొత్తం 15 రాష్ట్రాకలు ఎంపీలను ఎన్నుకోవాల్సి ఉన్నా ఇందులో 12 రాష్ట్రాలకు..అక్కడ నుంచి ఒక్కొక్కరే ఎంపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో 12 రాష్ట్రా లనుంచి 41 మంది అభ్యర్ధులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన మూడు రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్ 10, కర్ణాటక 4, హిమాచల్‌ప్రదేశ్‌ ఒక స్థానానికి పోలింగ్ జరగనుంది.

మొదటగా ఉత్తరప్రదేశ్..

మొదటగా ఉత్తరప్రదేశ్ రాజ్యసభ ఎంపీ పోలింగ్ జరగనుంది. ఇది మరికాసేపట్లో మొదలు కానుంది. ఇక్కడ 10 స్థానాలకు ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 11 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. వీరిలో బీజేపీ 8 మంది, సమాజ్‌వాద్‌ పార్టీ వారు ముగ్గురు ఉన్నారు. మొత్తం 403 మంది సభ్యలున్న యూపీ అసెంబ్లీలో 397 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నిక అయ్యాక కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు నిర్వహిస్తారు.

ఏకగ్రీవ ఎమ్మెల్యేలు  వీరే..

మరోవైపు ఏకగ్రీవం అయిన 41 మంది ఎంపీల్లో సోనియాగాంధీ, జేపీ నడ్డా, అశోక్ చవాన్, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ఎల్ మురుగన్‌లు ఉన్నారు. ఏకగ్రీవం అయిన ఎంపీలో ఎక్కువగా 20 మంది బీజేపీ నుంచి ఉండగా..కాంగ్రెస్ నుంచి 6గురు, టీఎంపీ నుంచి నలుగురు, వైసీపీ ముగ్గురు , ఆర్జీడీ నుంచి 2, బీజేడీ నుంచి ఇద్దరు, ఎన్సీపీ, శివసేన, బీఆర్ఎస్, జేడీయూల నుంచి ఒక్కరు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Also Read:Gold Rates : మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!

Advertisment
తాజా కథనాలు