Parliament : ప్రస్తుతం పార్లమెంటులో శీతాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్(CEC) కు సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) , ఎన్నికల కమిషనర్ (ఈసీ) బిల్లు-2023 ను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రకారమే ఈ బిల్లును తీసుకొచ్చామని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ తెలిపారు. 1991 నాటి చట్టంలో సీఈసీ, ఈసీల నియామక నిబంధనలు లేవని.. అయితే వాటిని తాజా బిల్లులో పొందుపరిచామని పేర్కొ్నారు. ఇప్పటివరకు ప్రభుత్వమే సీఈసీ, ఈసీల నియామకాలను చేపట్టేదని.. ఇకనుంచి వాటి నియామకాలకు సంబంధించి కమిటీ చూసుకుంటుందని తెలిపారు. అలాగే వారికి ఇవ్వాల్సిన వేతనాలు, ఇతర అంశాలను కూడా బిల్లులో పొందుపరిచామని.. సీఈసీ, ఈసీలకు చట్టపరమైన రక్షణను కూడా కల్పించామని వెల్లడించారు.
Also Read: పేదలకు ఇళ్ళ పంపకాలపై ఫోకస్..ధరణి పేరులో మార్పు?
మరోవైపు ఈ బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లులో ఉన్న అంశాలు ఈసీ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఆరోపణలు చేశాయి. ప్రధాని, ఆయన నామినేటెడ్ చేసే సభ్యలు.. సీఈసీ, ఈసీలను నియమించడం అనేది ఎన్నికల సంఘాన్ని నామమాత్రంగా మార్చడమేనని రణదీప్ సూర్జేవాలా అన్నారు. అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్‌ను ఈ ఎంపిక కమిటీలో ఎందుకు చేర్చలేదని.. ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా ప్రశ్నలు సంధించారు. సీఈసీ, ఈసీల హోదాను కేబినెట్ సెక్రటరీ స్థాయికి కేంద్రం దిగజార్చిందంటూ టీఎంసీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. విపక్షాలు ఈ బిల్లును తిరస్కరించినప్పటికీ.. మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
Also Read: ఐఏఎస్ స్మితా సబర్వాల్ కీలక నిర్ణయం..ఆసక్తికరంగా ట్వీట్