ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్‌ స్టార్ మల్టీస్టారర్‌.. రజినీకాంత్ ఎమోషనల్‌ ట్వీట్

బిగ్ బితో 33 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నాడు సూపర్‌స్టార్ రజినీకాంత్‌. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఓ ట్వీట్ చేశారు. 'ఇన్నేళ్ల తర్వాత నా మెంటర్ అమితాబ్ బచ్చన్‌తో, నా 170వ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది'అని పోస్ట్ చేశారు రజినీకాంత్.

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. బిగ్‌బీతో సూపర్‌ స్టార్ మల్టీస్టారర్‌.. రజినీకాంత్ ఎమోషనల్‌ ట్వీట్
New Update

Rajinikanth very excited to act with Amitabh Bachchan: జైలర్ మూవీ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్.. మరో పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రజనీకాంత్ 170వ సినిమాను ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞాన్‌వేల్ 'తలైవర్ 70' వర్కింగ్ టైటిల్‌పై తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కేరళలలో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ముంబైలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలక అప్‌డేట్‌ను రజినీకాంత్ వెల్లడించారు. 'తలైవర్ 170'(వర్కింగ్ టైటిల్)లో ఇండియన్ మూవీ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారని తెలియజేశారు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోతో తలైవా ఒక ట్వీట్ చేశారు. 33 సంవత్సరాల తరువాత మళ్లీ తన గురువైన అమితాబ్‌తో కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు రజనీకాంత్.

'లైకా ప్రొడక్షన్‌లో దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న 'తలైవర్ 170' సినిమాలో 33 సంవత్సరాల తరువాత నేను నా గురు సమానులు, గొప్ప వ్యక్తి అయిన అమితాబ్ బచ్చన్‌తో కలిసి పని చేస్తున్నాను. మళ్లీ ఇన్నాళ్లకు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా మనసు ఆనందంతో గంతులేస్తుంది.' అని ట్వీట్ చేశారు రజనీకాంత్. తలైవర్ 170 సెట్‌లో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి దిగిన ఫోటోలో అటు తలైవా.. ఇటు బిగ్ బి ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

publive-image

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, ఇండియన్ ఫిల్మ్ లెజెండ్‌ అమితాబ్ బచ్చన్ ఇద్దరూ కలిసి గతంలో పలు హిందీ సినిమాలో పని చేశారు. వీరిద్దరూ చివరి సారిగా 1991లో ముకుల్ ఆనంద్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'హమ్‌'లో వెండితెరపై కనిపించారు. ఆ సినిమాలో వీరిద్దరూ అన్నదమ్ముల్లా నటించి, ప్రేక్షకులను అలరించారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత వీరిద్దరూ కలిసి సినిమాలో నటిస్తుండటంతో 'తలైవర్ 170' సినిమాకు ఫుల్ హైప్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ ఇలా ఉంటే.. 'తలైవర్ 170' సినిమాతో బిగ్ బి కోలీవుడ్ అరంగేట్రం చేయడం మరో విశేషం.

publive-image

సోషల్‌ మెసేజ్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ మూవీని జై భీమ్ ఫేమ్ డైరెక్టర్ జ్ఞానవేల్ తెరక్కెక్కిస్తుండగా.. లైకా సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సుభాస్కరన్ నిర్మాత. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తలైవర్ 170లో మంజు వారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుషార విజయన్, GM సుందర్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

Also Read: వెంకీ మామ కూతురు ఎంగేజ్ మెంట్.!

#lyca-productions #amitabh-bachchan #rana-daggubati #rajinikanth #fahadh-faasil #dushara-vijayan #amitabh-in-thalaivar-170 #thalaivar170 #director-gnanavel #anirudh-ravichander #ritika-singh #manju-warrier
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe