అట్టుడుకుతున్న రాజ‌స్థాన్.. కొన‌సాగుతున్న బంద్

రాజస్థాన్ రాష్ట్రం అట్టుడుకుతోంది. దారుణ హత్యకు గురైన సుఖ్ దేవ్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చెపట్టారు. నిందుతులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో చురు, ఉదయ్ పూర్, అల్వార్, జోధ్ పూర్ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

అట్టుడుకుతున్న రాజ‌స్థాన్.. కొన‌సాగుతున్న బంద్
New Update

Rajasthan Bandh : రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన (Rajput Karni Sena)జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్‌ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. హత్యకు నిరసనగా సుఖ్‌దేవ్ సింగ్ (Sukhdev Singh) మద్దతుదారులు బుధవారం రాజస్థాన్‌ బంద్‌కు పిలుపునివ్వగా రోడ్లపైకి వచ్చి దర్నాలు చేస్తున్నారు. బాధితుడికి వెంటనే న్యాయం చేయాలని నిరసనలు చేపట్టారు.

శ్రీ రాష్ట్రీయ రాజ్‌పూత్‌ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్‌ సింగ్‌ గోగామేడీ పట్టపగలు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లోని శ్యామ్‌నగర్‌లో తన నివాసంలో ఉండగా దుండగులు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు వ్యక్తులు మంగళవారం మధ్యాహ్నం సుఖ్‌దేవ్‌ నివాసానికి వెళ్లారు. గోగామేడీతో మాట్లాడాల్సి ఉందని భద్రతా సిబ్బందికి చెప్పారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని లోపలకు తీసుకెళ్లారు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ముగ్గురు దుండగుల్లో ఒకడైన నవీన్‌ షెకావత్‌ సహచరుల కాల్పుల్లో మరణించాడు. గోగామేడీ భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతోనే నవీన్‌ మరణించాడని జైపుర్‌ పోలీస్‌ కమిషనర్‌ బిజు జార్జ్‌ జోసెఫ్‌ తొలుత వెల్లడించారు. సుఖ్‌దేవ్‌ హత్యకు తమదే బాధ్యత అంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠాకు అనుబంధంగా పనిచేసే రోహిత్‌ గోదారా గ్యాంగ్‌ ప్రకటించుకుంది.

Also read :తల్లి శ్రీదేవి గౌనులో దర్శనమిచ్చిన ఖుషి.. ఆ అందాలకు ఫ్యాన్స్ ఫిదా

ఘటన విషయం గురించి తెలియగానే పెద్ద ఎత్తున రాజ్‌పుత్ సామాజిక వర్గం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చురు, ఉదయ్‌పూర్, అల్వార్, జోధ్‌పూర్ జిల్లాల్లోనూ నిరసనలకు దిగారు. దీంతో, పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి రాజస్థాన్‌ రాజకీయాల్లో పట్టుంది. రాజపుత్ర సంఘాలనే కర్ణిసేనలుగా పిలుస్తుంటారు. స్థానికంగా కర్ణిసేనల ప్రాబల్యం ఎక్కువ. వీటిలో ప్రముఖంగా వినిపించే పేరు ‘రాజ్‌పుత్‌ కర్ణిసేన’. 2006లో ఇది ఏర్పడింది. షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలు నటించిన ‘పద్మావత్‌’ సినిమా సమయంలో వార్తల్లో నిలిచింది. రాజపుత్రుల చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ జైపుర్‌లో సినిమా సెట్‌పై దాడికి దిగి బీభత్సం సృష్టించింది. గతంలో ఇదే సంస్థకు చెందిన సుఖ్‌దేవ్‌ సింగ్‌.. ‘రాష్ట్రీయ రాజ్‌పుత్‌ కర్ణిసేన’ పేరుతో సొంత సంస్థ ఏర్పాటు చేసుకున్నారు.

#bollywood #rajput-karni-sena #sukhdev-singh-gogamedy #ranveer-singh #rajasthan #deepika-padukone #bandh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe