SSMB29: మహేష్ బాబు కోసం 8 లుక్స్..రాజమౌళి కసరత్తులు దర్శకధీరుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్‌బాబుతోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినిమాలో మహేష్ ఎలా కనిపించాలి అన్న దానికి కోసం 8 రకాల లుక్స్‌ను రాజమౌళి తయారు చేయించారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Mar 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mahesh Babu - SS Rajamouli Movie: రాజమౌళి-మహేష్ బాబు సినిమా కోసం అంతా సిద్ధం అవుతోంది. త్వరలోనే ఈసినిమా ష్ట్రటింగ్ స్టార్ట్ అవుతుందని రాజమౌళి కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన చాలా అప్‌డేట్సే వచ్చాయి. సోషల్ మీడియాలో రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. అయితే సినిమా త్వరలోనేస్టార్ట్ అవుతుందని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు కూడా కన్ఫామ్ చేశారు. ఈసినిమా కోసం మహేష్ కూడా రెడీ అవుతున్నారు. ఇప్పటికే తన లుక్ను మార్చుకున్నారు. జుట్టును పెంచారు. దాంతో పాటూ బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈసినిమాలో మహేష్ లుక్ గురించిమరో వార్త ట్రెండ్ అవుతోంది. ఎనిమిది లుక్స్... మహేష్‌తో (Mahesh Babu) రాజమౌళి తీయబోయే సినిమా గురించి ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ చాలా గొప్పగా చెప్పారు. ఇప్పటివరకు ఇండియన్ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నామని ఆయన చెప్పారు కూడా. అమెజాన్ అడవుల నేపథ్యంలో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇందులో విదేశీ నటులు కూడా ఉండనున్నారు. ఈ సినిమాలో ఇప్పటి వరకు కనిపించని లుక్‌లో మహేష్ కనిపిస్తారని చెబుతున్నారు. ఈ లుక్ కోసం మూవీ యూనిట్ ఇప్పుడు కసరత్తులు చేస్తోంది. ఈ మూవీలో మహేష్ పొడవాటి జుట్టుతో కనిపిస్తారు. హీరో లుక్‌కు సంబంధించి స్కెచ్‌లు పూర్తయ్యాయని సమాచారం. మొత్తం ఎనిమిది లుక్స్‌ను జక్కన్న టీమ్ రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. కథకు, మహేశ్ బాడీకి సరిపోయేలా ఆ లుక్స్‌లో మహేశ్‌ను టెస్ట్ ఫొటో షూట్ చేసి, ఫైనల్ లుక్‌ను ఖరారు చేయనున్నారని చెబుతున్నారు. అయితే ఈ విషయం గురించి మహేష్ బాబు కానీ, రాజమౌళి కానీ ఎక్కడా మాట్లాడలేదు. త్వరలోనే ఎప్పట్లాగే తన సినిమాలకు సంబంధించిన వివరాలను రాజమౌళి ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రెస్‌మీట్ ఎప్పుడు ఉంటుందా? అని మహేశ్‌బాబు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. Also Read:Movies: దీపికా బాటలోనే మరో సూపర్ లేడా స్టార్..ఆమె కూడా తల్లి కాబోతోందా? #mahesh-babu #ss-rajamouli #movies #ssmb29 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి