Weather Alert: మరో మూడు రోజులు వర్షాలే

హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Weather Alert: మరో మూడు రోజులు వర్షాలే
New Update

Rain Alert: హైదరాబాద్‌లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. కొన్నిరోజుల నుంచి ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు.. తాజాగా ఉష్ణోగ్రతలు తగ్గడంతో కాస్త ఉపశమనం లభించినట్లైంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Also Read: సీఎం రేవంత్ డేంజర్‌లో ఉన్నారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు.. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌, వికారాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా్ల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఇక హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. అలాగే గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 36-26 డిగ్రీల మధ్య ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి వీచే అవకాశాలు ఉన్నట్లు వివరించింది.

Also Read: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. ఆ రూట్లలో నెల రోజులు ట్రాఫిక్ డైవర్షన్!

#rains #weather-alert #heavy-rain-alert #telangana-news #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe