Ayodhya: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు

అయోధ్యలో గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు.

Ayodhya: అయోధ్యలో దంచికొట్టిన వానలు.. ఇబ్బందుల్లో భక్తులు
New Update

అయోధ్యలో వర్షం బీభత్సం సృష్టించింది. గత రెండు రోజులుగా వానలు దంచికొట్టాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల వరకు నీరు నిలిచిపోయింది. అయోధ్య రాముని దర్శనానికి వెళ్లిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది. రామమందీర్ సమీపంలోని జల్వాన్‌పురాలో ఇళ్లలోకి మురుగునీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామమందిరం చుట్టూ హడావిడిగా నిర్మాణ పనులు చేపట్టడంతోనే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని స్థానికులు అంటున్నారు. ఆలయం రూఫ్ నుంచి కూడా నీరు లీకయ్యాయి. అయితే మరో మూడు రోజుల పాటు అయోధ్యకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ముగిసిన ఉమ్మడి రాజధాని కాలపరిమితి.. వాటా కావాలంటున్న ఏపీ

#telugu-news #rains #ayodhya #heavy-rains #ram-mandhir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe