Mumbai: ముంబయ్‌కు రెడ్ అలర్ట్..దంచికొడుతున్న వర్షాలు మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబయ్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాతావరణశాఖ ముంబయ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు. By Manogna alamuru 26 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Heavy Rains: ఈరోజు ఉదయం 8.30గంటల వరకు ముంబయి నగరానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో పౌరులంతా ఇళ్లలోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. సురక్షితంగా ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 100, 112 నంబర్లకు కాల్ చేయాలని ముంబయ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నగరాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వానలు కారణంగా 11 విమానాలను రద్దు చేయగా.. 10 విమానాలను మళ్లించారు. గురువారం ఉదయం 8.30గంటల వరకు 24గంటల వ్యవధిలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ముంబయి నగరంలో 44 మి.మీల వర్షపాతం నమోదు కాగా.. తూర్పు సబర్బన్ ప్రాంతంలో 90 మి.మీ, పశ్చిమ సబర్బన్‌లో 89 మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల కారణంగా ఇప్పటికి ఆరుగురు మృతి చెందారు. మరోవైపు పూణెలోనూ రికార్డ్ స్థాయి వర్షాలు నమోదయ్యాయి. వర్ష బీభత్సానికి నీరు రోడ్లపైకి, ఇళ్లలోకి చేరడంతో జనం అవస్థలు పడ్డారు. రాయ్‌గఢ్-పుణె మార్గంలోని కొండచరియ విరిగిపడటంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. Also Read:Paris Olympics: శరణార్ధి నుంచి పారిస్ ఒలింపిక్స్ వరకూ..స్విమ్మర్ యుస్రా జర్నీ #maharashtra #rains #mumbai #red-alert మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి