Weather Alert : ఏపీ,తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ కామారెడ్డి, మెదక్‌,నిజామాబాద్‌, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా వచ్చే 2 రోజుల పాటు వానలు కురుస్తాయని పేర్కొంది.

Weather Alert : ఏపీ,తెలంగాణకు భారీ వర్ష సూచన
New Update

Rain Alert For Andhra Pradesh & Telangana : తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కామారెడ్డి, మెదక్‌,నిజామాబాద్‌,సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్,హైదరాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల,భూపాలపల్లి,కరీంనగర్, కొమురంభీం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, నిర్మల్‌, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Also Read: టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?

ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ (Hyderabad) లో రాత్రి భారీ వర్షం కురిసింది. యూసుఫ్‌గూడలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాంనగర్, కృష్ణానగర్‌లో కార్లు కొట్టుకుపోయాయి. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీకి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Also read: టూరిస్టుల బట్టలెత్తుకెళ్లిన పోలీసులు.. ఎక్కడంటే ?

#weather-alert #telugu-news #heavy-rains #imd
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe