Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం(Weather) లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ(Telangana) లోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rain) పడుతుండడంతో ప్రజలు వేడి గాలుల నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇటు ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఇప్పటికే గత రెండు రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లాలో వాతావరణం పూర్తిగా మారిపోయి.. తిరుమల(Tirumala) లో భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమల వీధులన్ని నీట మునిగాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ(IMD) రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని వివరించింది.
సోమవారం అన్నమయ్య , కడప, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వివరించింది. రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖాధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని వాతావరణశాఖాధికారులు వివరించారు.
మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో సోమవారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది., నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Also read: బాబోయ్ ఏం ఎండలు రా ఇవి… తట్టుకోలేకపోతున్నాం..వడదెబ్బతో అల్లాడుతున్న ప్రజలు!