T20 World Cup: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?

ఇవాళ ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ప్లేస్‌లో వర్షం పడే సూచన ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే విజేతను ఎలా నిర్ణయిస్తారు?

T20 World Cup: టీ20 ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు? మ్యాచ్ రద్దయితే విజేతను తేల్చేదెలా?
New Update

టీ20 ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. అక్కడి సమయం ప్రకారం ఉదయం 10.30 గంటకు, భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమితి గంటలకు మ్యాచ్ రగనుంది. అయితే ఇప్పుడు ఈ ఫైనల్స్ మీద వర్ష మేఘాలు కమ్ముకున్నాయి. అక్కడా వాతావరణ పరిస్థితులను బట్టి మ్యాచ్ జరిగే సమయానికి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది.తెల్లవారుజామున 3 నుంచి 10 గంటల వరకు దాదాపు 50 శాతం వర్షం కురిసే అవకాశం ఉండగా, ఉదయం 11 గంటలకు తుపానుతో కూడిన వర్షం కురిసే అవకాశం 60 శాతం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.

ఒకవేళ వాతావరణశాఖ చెప్పినట్టే జరిగితే ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మ్యాచ్ సమయం ఉండగానే వర్షం కురిసి పిచ్ తడి ఆరిపోతే అప్పుడే నిర్వహిస్తారు. అలాకాని పక్షంలో టైటిల్ మ్యాచ్ కోసం ఐసీసీ రిజర్వ్‌ డే ఉంచింది. జూన్ 29న మ్యాచ్ జరగకోతే...౩౦వ తేదీన జరుగుతుంది. మ్యాచ్ కోసం అదనంగా 190 నిమిషాల సమయాన్ని కేటాయించింది ఐసీసీ. రెండు రోజుల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఒకవేళ మ్యాచ్‌ శనివారం ప్రారంభమై మధ్యలో ఆగిపోతే.. ఆదివారం అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఒకవేళ రిజర్వ్‌ డే కూడా వర్షం పడితే మాత్రం రెండు జట్లనూ విజేతలుగా ప్రకటిస్తారు.

ఇప్పటివరకు జరిగిన మొత్తం వరల్డ్‌కప్‌లో భారత్, సౌత్ ఆఫ్రికా రెండు జట్లూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్‌కు నేరుకున్నారు. వన్డే ప్రపంచప్‌లో చివరి నిమిషంలో కప్‌ను చేజర్చుకున్న టీమ్ ఇండియా ఇప్పుడు టీ 20 కప్‌ను సాధించి కసి తీర్చుకుందామని చూస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా మొదటిసారి కప్‌ను గెలుచుకుని తమ మీద ఉన్న చోకర్స్ ట్యాగ్‌‌ను తొలగించుకోవాలని అనుకుంటోంది.

Also Read:Cricket: రికార్డ్‌లలో మాకు సాటే లేదంటున్న రోహిత్, బుమ్రా

#rain #india #south-africa #t20-world-cup #final-match
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe