Rain in Telangana: హైదారాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇప్పటివరకు ఎండలు మండిపోగా.. తాజాగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. పలు ప్రాంతాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రేటర్ హైదరాబాద్‌కు వర్ష సూచన చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలందరూ అలెర్టుగా ఉండాలని సూచించింది. ఇక రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా.. చెట్లు, హోర్డింగ్స్ కూలిపోతే వాటిని వెంటనే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా బల్దియా అధికారులు ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాల్లో ఎవరికైనా సమస్యలు ఉంటే 040-21111111, 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. ఇక జూన్ 6న తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also read: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి