Tamil Nadu: నటి రాధికా శరత్‌ కుమార్‌ కు ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు!

తమిళనాడు నుంచి బీజేపీ తరుఫున నటి రాధికా శరత్ బరిలోకి దిగుతున్నారు. విరుదునగర్‌ నుంచి పోటీ చేస్తున్న రాధిక నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంట్లో ఆమె మొత్తం ఆస్తులు, అప్పులను ప్రకటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

New Update
Tamil Nadu: నటి రాధికా శరత్‌ కుమార్‌ కు ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు!

Radhika Sarath Kumar: దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. మొదటి దశ పోలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో  అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తు్న్నారు. ఇందులో తమిళనాడు (Tamil Nadu) నుంచి పోటీ చేస్తున్న నటి రాధికా శరత్ కుమార్ కూడా ఉన్నారు. ఈమె పోటీ చేస్తున్న విరుదునగర్ స్థానానికి మొదటిదశలోనే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. రాధిక పోటీ చేయడం ఇదే తొలిసారి. ఈ మధ్యనే రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో (BJP) విలీనం చేశారు. దీంతో రాధికను బీజేపీ విరుదునగర్ నుంచి నిలబెట్టింది.

నామినేషన్ దాఖలు..

ఎంపీ పోటీ కోసం రాధికా శరత్ కుమార్ నిన్న నామినేషన్ ప్రతాలు సమర్పించారు. ఇందులో ఆమె మొత్తం ఆస్తులు, అప్పులతో పాటూ ఇతర వివరాలను ప్రకటించారు. దాని ప్రకారం రాధికకు మొత్తం 53.45 కోట్లు ఆస్తి ఉండగా..14.79 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆస్తుల విలువలో 33.01 లక్షల నగదు ఉంటే...75 తులాల బంగారం, 5 కేజీల వెండి ఆభరణాలతో పాటూ 27.05 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రాధికా శరత్ కుమార్ ఇంకా సినిమాల్లో, సీరియళ్ళల్లో నటిస్తూనే ఉన్నారు. దాంతో పాటూ రాడాన్ మీడియా వర్క్స్ ఇండిమా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వివరాలు అన్నీ కూడా రాధిక నామినేషన్ పత్రాలలో పొందుపరిచారు.

తెలుగు హీరోయిన్‌గా..

రాధికాశరత్ కుమార్ నటిగా తెలుగు వారికి బాగా పరిచయం. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా వెలుగొందారు. చిరంజీవికి మంచి జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీయార్, ఏఎన్నార్ నుంచి దాదాపు అందరితోనే హీరోయిన్‌గా చేశారు రాధిక. మీరోయిన్‌గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత కూడా రాధిక సినిమాల్లో నటిస్తూనే ఉననారు. తల్లిగా, అత్తగా క్యారెక్టర్లు వేస్తూ తనదైన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు. దాంతో పాటూ తన మీడియా సంస్థ నుంచి సీరియల్స్ కూడా చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు.

ఇక విరుదనగర్‌లో రాధికాకు పోటీగా దివంగత నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్ పోటీలో ఉన్నారు. ఇతను అన్నాడీఎంకే నేత. అయితే ప్రస్తుతం పొత్తుల్లో భాగంగా డీఎంకే నుంచి పోటీ చేస్తున్నారు. ఈయ కూడా తన ఆస్తుల విలువ మొత్తం 17.95 కోట్లు అని ప్రకటించారు.

Also Read:Tamil Nadu: ఒకప్పుడు సీఎం…ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..పన్నీర్ సెల్వం పరిస్థితి

Advertisment
తాజా కథనాలు