Putin Gift To Kim : రష్యా(Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్(Kim Jong Un) ఉన్‌కు ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఫిబ్రవరి 18వ తేదీన.. కిమ్ జోంగ్ ఉన్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా ప్రతినిధి పాక్ జోంగ్ ఛోన్ దాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో.. కిమ్ యో జోంగ్ రష్యాకు కృతజ్ఞతలు చెప్పారు.
Also Read : నావల్నీ మృతిపై కీలక అప్‌డేట్.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!
రష్యాకు సహకరిస్తున్న ఉ.కొరియా
మరోవైపు.. రష్యా, ఉత్తరకొరియా దేశాలపై అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో వ్లాదిమీర్ పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ మాస్కోలో సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ యుద్ధంలో.. ఉత్తర కొరియా రష్యాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్షిపణలు, రాకెట్లతో పాటు పలు ఆయుధాలను కూడా సరఫరా చేస్తు్న్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉత్తర కొరియా వీటిని ఖండిస్తోంది.
అన్నీ అక్రమ వాహనాలే..!
కిమ్ జోంగ్ ఉన్‌కు వాహనాలంటే వ్యక్తిగతంగా ఇష్టం అని కొందరు చెబుతుంటారు. ఆయన దగ్గర చాలావరకు లగ్జరీ కార్లు(Luxury Cars) ఉన్నట్లు సమాచారం. అంతేకాదు అవన్నీ కూడా అక్రమంగా రవాణా చేసినవనే ప్రచారం ఉంది. గత ఏడాది కిమ్.. రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్ కారు ఆరస్ సెనేట్ లిమోసిన్‌ను ఆసక్తిగా పరిశీలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కిమ్‌ను కారులో ఎక్కించుకొని పుతిన్ డ్రైవ్ చేసినట్లు వార్తలు కథనాలు వచ్చాయి. ఇప్పడు కిమ్ వద్ద మెర్సిడెస్,మేబ్యాక్, రోల్స్ రాయిస్ లాంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. ఇప్పుడు పుతిన్ కారు గిఫ్ట్‌గా ఇవ్వడం వల్ల ఇది నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : చైనా-పాకిస్తాన్ ల పై టాటా గూఢచారి..మస్క్ స్పేస్ ఎక్స్ నుంచి అంతరిక్షానికి..