మహారాష్ట్రలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు తనని భర్త దుబాయ్ కి తీసుకుని వెళ్లలేదని ఆగ్రహించిన భార్య..భర్త పై దాడి చేసి చంపేసింది. ఈ దారుణ సంఘటన పుణెలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిఖిల్ ఖన్నా (36) పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంత కాలం క్రితం తనకంటే పెద్దది అయినా రేణుకను ప్రేమించి వివాహం చేసుకున్నాడు.
కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య ప్రతి చిన్న విషయానికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆమె పుట్టిన రోజును దుబాయ్ జరపాలని కొరింది. కానీ దానికి నిఖిల్ నిరాకరించాడు. పుట్టిన రోజు, పెళ్లి రోజు నిఖిల్ తన భార్యకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెందింది.
కనీసం కొందరు బంధువులతో అయినా కలిసి ఢిల్లీకి వెళ్లి అయినా సెలబ్రేట్ చేసుకుందామని కోరింది. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
దీంతో ఆమె ఆవేశంతో ఒక్కసారిగా భర్త ముఖం మీద పిడిగుద్దులు కురిపించడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ముక్కు పై దెబ్బ బలంగా తగలడంతో అతనికి ముక్కు నుంచి రక్తం వచ్చింది. అంతే కాకుండా నోటి పళ్లు కూడా రాలిపోయాయి.
వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా నిఖిల్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
Also read: శ్రీవారి నడకదారిలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ మృతి!