Chiranjeevi : ఎమ్మెల్యే నివాసంలో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్..!
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే కోరిక మేరకు చిరు కేక్ కట్ చేసి సతీమణి సురేఖ, ఎమ్మెల్యేకు తినిపించారు.