మీ రేవంత్ అన్నగా నిలబడతా..రేపటి నుంచే ప్రజా దర్బార్.

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జై సోనియమ్మ అంటూ మొదలుపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా సని చేస్తూ రేవంత్ అన్నగా నిలబడతానని హామీ ఇచ్చారు.

మీ రేవంత్ అన్నగా నిలబడతా..రేపటి నుంచే ప్రజా దర్బార్.
New Update

Prajadarbar From Tomorrow : జై సోనియమ్మ (Sonia Gandhi)...జైజై సోనియమ్మ అంటూ ప్రసంగం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషీగా ఏర్పడలేదు. ఇది పోరాటాలతో.. త్యాగాల పునాదుల మీద ఏర్పడిందన్నారు రేవంత్. ఎన్నో ఆకాంక్షలను, ఆలోచనలను ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించి నాలుగు కోట్ల ప్రజలకు సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో సోనియా తెలంగాణ ఇచ్చారని అన్నారు. కానీ గత పదేళ్ళల్లో తెలంగాణ ప్రజలు నానా బాధలు పడ్డారు. వారి ఆకాంక్షలు ఏమీ నెరవేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది. ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారో దాన్ని నెరవేరుస్తామని..తెలంగాణ, ప్రజలకు, రైతులకు నిరుద్యోగులకు, అమర వీరుల కుటుంబాలకు మేలు కలిగేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగానను ఇందిరమ్మ రాజ్యం చేస్తుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Also read:తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం..

తెలంగాణ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరిగేలా చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి (Revanth Reddy). దానికి నిదర్శనమే ప్రగతి భవన్ చుట్టూతా నిర్మించిన ఇనుప కంచెలను తొలగించడమని చెప్పారు. ప్రగతి భవన్ ఇంక మీదట ప్రజలదని... అక్కడకు ఎప్పుడు రావాలనుకున్నా ప్రజలు రావొచ్చు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు భాగస్వాములని... రాష్ట్ర ప్రజలను ఆలోచనలను, ఆకాంక్షలను మిళితం చేసి పాలన సాగిస్తాని రేవంత్ హామీ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలకు రేవంత్ అన్నగా నిలబడతానని అన్నారు రేవంత్ రెడ్డి. రేపు ఉదయం పది గంటలకు జ్యోతి రావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని.. శాంతి భద్రతలను కాపాడుతూ తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేదిగా చేస్తామని తెలిపారు. పేదవారి సోదరుడుగా, బిడ్డగా బాధ్యతలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

#revanth-reddy #sonia-gandhi #telangana-cm #cm #telanagana #prajadarbar #speech
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe