Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్‌ వంగా సినిమాలో డబుల్ ధమాకా?

ఆల్ ఓవర్ ఇండియాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కున్న క్రేజ్‌ అందరికీ తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌‌గా మారిన ప్రభాస్ సందీప్ వంగాతో చేస్తున్న సినిమాలో ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇందులో హీరో, విలన్ రెండూ ప్రభాసేనని వార్తలు వస్తున్నాయి.

Prabhas : విలన్‌గా ప్రభాస్.. సందీప్‌ వంగా సినిమాలో డబుల్ ధమాకా?
New Update

Prabhas-Sandeep Vanga Movie : బాహుబలి తర్వాత వైవిధ్యభరితమై సినిమాలు చేస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ (PAN INDIA STAR) ప్రభాస్ (Prabhas). సాహోతె యాక్షన్, రాధేశ్యామ్ లవ్ స్టోరీగా, ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ.. ఇటీవల వచ్చిన సలార్, కల్కి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ సత్తా ఏంటో చూపించాయి. సలార్‌‌లో హైఓల్టేజ్ యాక్షన్ తో హిట్ కొట్టిన ప్రభాస్.. మైథలాజికల్ సైన్స్ ఫిక్షనల్ మూవీ కల్కితో బాక్సాఫీస్ దగ్గర వెయ్యికోట్లు కొల్లగొట్టాడు. వీటి తర్వాత సలార్ సీక్వెల్, కల్కి పార్ట్ టూలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటి తర్వాత మారుతితో, సందీప్ వంగా (Sandeep Vanga) తో సినిమాలు లైనప్‌ పెట్టాడు. మారుతితో చేస్తున్న రాజాసాబ్‌లో లవర్ బాయ్‌గా, ఫౌజీలో సైనికుడిగా కనిపించబోతున్నాడు.

ఇక సందీప్ వంగాతో చేస్తున్న స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ డబుల్ యాక్షన్‌లో కనిపించనునాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ అయితే..మరొకటి నెగెటి షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. ఇదే నిజమైతే కనుక హీరో ప్రభాస్, విలన్ ప్రభాస్ ఒకరితో ఒకరు తలపడితే ధియేటర్లు దద్ధరిల్లిపోవాల్సిందేనని అంటున్నారు ఫ్యాన్స్. ఆ లెక్కన స్పిరిట్ సినిమా ఊహకందని విధంగా ఉంటుందని అంటున్నారు. అనిమల్ సీక్వెల్‌ను రణ్‌బీర్ వర్సెస్ రణ్‌బీర్‌గా ప్లాన్ చేస్తున్న సందీప్.. దానికంటే ముందే ప్రభాస్ వర్సెస్ ప్రభాస్‌గా ప్లాన్ చేస్తాడేమో చూడాలి. అన్నట్టు.. ఈ సినిమాలో త్రిష (Trisha) హీరోయిన్‌గా నటిస్తుందని.. ఆమె కూడా నెగిటివ్ రోల్‌లో కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు నిజమో కాదో..సందీప్ వంగా ఏం చెబుతాడో చూడాలి.

Also Read: Andhra Pradesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం

#prabhas #tollywood #dual-role #sandeep-vanga
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe