/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/36-jpg.webp)
Poonam Pandey Death: బాలీవుడ్ నటి పూనమ్ పాండే చనిపోయింది. ఇది నిన్నటి సంచలన వార్త. దీని మీద మీడియాలో, సోషల్ మీడియాలో తెగ హైలట్ చేశారు. వరుస పెట్టి కథనాలు వచ్చాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలా మంది సంతాపం ప్రకటించారు. మొత్తానికి గోలగోల అయింది. అయితే ఈరోజు అదంతా ఒట్టిదే అని చెబుతున్నారు. పబ్లిసిటీ కోసమే అంతా చేసిందని చెబుతున్నారు. నిన్న వ్యక్తమయిన అనుమానాలు ఈరోజు నిజమయ్యాయి. దానికి సంబంధించిన వార్తలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి.
పూనమ్ పాండే..
ఈమె ఒక మోడల్ (Model). ఏవో కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈమె ఒక పోర్న్ స్టార్ కూడా. అయితే వీటన్నింటికన్నా ఈమె ఎక్కువగా పబ్లిసిటీ స్టంట్స్‌తో (Publicity Stunts) ఫేమస్ అయింది. భర్త షూట్ చేస్తుంటే పోర్న్ వీడియోల్లో పాల్గొనడం...మళ్ళీ ఆ భర్తే తనని హింసిస్తున్నాంటూ కేసు పెట్టడం...2011 వరల్డ్ కప్ గెలిస్తే నగ్నంగా తిరుగుతా అంటూ అనౌన్స్ చేయడం లాంటి వాటితో ఫుల్ పైరే పంపాదించుకుంది. వార్తల్లో బాగా వైరల్ అయింది. అదిగో ఆ అలవాటే ఇప్పుడు కూడా ప్రదర్శించింది. కొన్ని రోజులుగా కామ్‌గా ఉంటున్న పూనమ్ పాండే మళ్ళీ టాక్ ఆఫ్ న్యూస్ అవ్వాలనుకుంది. దాని కోసం ఏకంగా చనిపోయినట్లు నటించి, నమ్మించింది.
ముందు నుంచే అనుమానం...
పూనమ్ పాండే పర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్లు ఆమె పీఆర్ మేనేజర్ ఇన్స్టా గ్రామ్‌లో పోస్ట్ట చేశాడు. ఇదొక్కటే ఆమె మరనానికి సంబంధించిన వార్త. దీన్ని బేస్ చేసుకునే అన్ని మీడియాల్లోని కథనాలు వచ్చాయి. ముందు అయితే అందరూ విచారాన్ని వ్యక్తంచేశారు కానీ తరువాత మాత్రం దీని మీద చాలా అనుమానాలు వచ్చాయి. సర్వైకల్ క్యాన్సర్ (Cervical Cancer)...ఇదొక భయంకరమైన జబ్బు. ప్రతీ క్యాన్సర్‌కు స్టేజ్‌లు ఉంటాయి. ఒక్కో స్టేజ్‌తో ఒక్కో రకంగా బాధితులు ఇబ్బంది పడుతుంటారు. స్టేజ్ 4 వస్తే కానీ చనిపోరు. ఆ స్టేజ్‌లోకి వచ్చిన మనిషి అస్సలు ఆరోగ్యంగా ఉండలేడు. మనిషిని చూస్తేనే క్లియర్‌గా తెలిసిపోతుంది. కానీ పూనమ్ పాండేలో అలాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించలేదు. చనిపోయింది అని చెప్పిన రోజుకు రెండు రోజుల ముందు కూడా షూటింగ్‌లో పాల్గొంది. అయోధ్య రామమందిర్ ప్రారంభోత్సవం నాడు కూడా చాలా హుషారుగా కనిపిస్తూ వీడియో పోస్ట్ చేసింది. అక్కడే చాలా మందికి డౌట్ వచ్చేసింది. దాంతో సర్వై్కల్ క్యాన్సర్ వచ్చిన పూనమ్ అలా ఎలా సడెన్‌గా చనిపోయింది? ఎందుకు ఎవరికీ అసలు తెలియను కూడా తెలియలేదు అన్న ప్రశ్నలు వచ్చాయి.
మిస్సింగ్ కేసు నమోదు చేసిన తల్లిదండ్రులు.
జనవరి 29న పూనమ్ పాండే చివరి సారిగా అందరికీ కనిపించింది. తరువాత నుంచి ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ నాలుగు రోజుల తర్వాత నిన్న 2వ తేదీన ఆమె చనిపోయిందంటూ అనౌన్స్ చేశారు. అయితే ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. అప్పటి నుంచి పూనమ్ వారికి కూడా కనిపించలేదు, కాంటాక్ట్‌లో కూడా లేదు. నిన్టి మరణ వార్తతో పేరెంట్స్ ఆందోళన చెందారు. దాంతో వారు తమ కూతురు తప్పిపోయింది అంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఇదే పూనమ్ పాండే చనిపోలేదు అనడానికి పెద్ద రీజన్ అయింది. కూతురు చనిపోతే కన్న తల్లిదండ్రలకు తెలియకుండా ఎలా ఉంటుంది. క్యాన్సర్ గురించి కూడా వారికి తెలియదా అని అడుగుతున్నారు.
బాడీగార్డ్ వాంగ్మూలం..
ఇది అన్నింటికన్నా ఇంపార్టెంట్ విషయం. జనవరి 29న ఆరోగ్యంగా ఉన్న పూనమ్ పాండేను (Poonam Pandey) ఆమె బాడీగార్డ్ ఇంటిలో డ్రాప్ చేశాడు. ఆ తరువాత అతను ఆమెను కలవలేదు. దాంతో పాటూ ఆమెకు క్యాన్సర్ ఉన్న విషయం కూడా బాడీగార్డ్‌కు తెలియదు. ఇంట్లో వదిలిపెట్టినప్పుడు పూనమ్ ఆరోగ్యంగా ఉన్నాదని చెబుతున్నాడు. పోలీసుల ఎంక్వైరీలో ఈ విషయాలననీ వాంగ్మూలంగా ఇచ్చాడు బాడీగార్డ్. దీంతో వారు కూడా పూనమ్ పాండే చనిపోలేదని చెబుతున్నారు.
ఉమైర్ సంధు కన్ఫర్మేషన్...
పూనమ్ పాండ్ చనిపోలేదని నమ్మకంగా చెబుతున్నాడు.. ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెడుతున్నాడు ఫ్యాషన్, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు. పూనమ్ బతికే ఉందని...ఆమె మరణ వార్తను చూసి ఆనందపడుతున్నారని ఉమైర్ ట్వీట్ చేశారు. తాను పూనమ్ కజిన్‌తో మాట్లాడానని...ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెబుతున్నాడు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
పూనమ్ పాండే చేసింది పబ్లిసిటీ స్టంట్ అని తెలియగానే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పబ్లిసిటీ కోసం మరీ ఇంత దిగజారాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అమె కనుక చనిపోకపోతే వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.