ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత బాలసాని లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ రోజు బాలసాని నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బాలసానిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నేను సైతం అంటూ తాను వస్తామన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని లక్షల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినా.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత బాలసాని.. ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి
హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. ఆదివారం బాలసాని నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసాని లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. బీఆర్ఎస్‌కు బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Translate this News: