మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అవినీతి చిట్టా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి బయట పెట్టారు. కాకినాడ ఎంఎస్ఎన్ గ్రౌండ్ విషయంలో మాజీ ఎమ్మెల్యే నాపై తప్పుడు ప్రచారంతో నాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఎమ్ఎస్ఎన్ గ్రౌండ్ అభివృద్ధి చేయడం కోసమే మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. డంపింగ్ యాడ్ చేస్తున్నారని.. లీజుకు ఇస్తూన్నారని.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. పూర్వ విద్యార్ధిగా నేను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానని ద్వారంపూడి వెల్లడించారు. మీ జాతి నాయుడు సత్యలింగనాయకర్ పేరుపై నీవు ఏమి చేయలేదని ప్రశ్నించారు. నీవు చేసిన అక్రమాలపై జగన్‌కి ఎప్పుడో అవినీతి చిట్టా ఇవ్వటం జరిగిందని ఆరోపించారు. గతంలో నీవు.. నీ తోత్తులను పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డావు అని ఆరోపించారు. మీ తండ్రి వనమాడి లోవరాజు పేరుతో తప్పుడు పట్టా తెచ్చేందుకు ప్రయత్నాం చేస్తే అప్పట్లో పిల్లి సత్తిబాబు అడ్డుకున్నారని ఆయన గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics: కొండబాబుపై ద్వారంపూడి సంచలన వాఖ్యలు..అవినీతి చిట్టా బయటపెడతానని హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రాభివృద్ధి శూన్యమని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులు అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుపై ద్వారంపూడి మాట్లాడుతూ.. సంచనల ఆరోపణలు చేశారు.
Translate this News: