ఈ సందర్బంగా విజయవాడలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సీనియర్ నేత (TDP Senior Leader) బుద్దా వెంకన్న (Buddha Venkanna) వైసీపీ నేతల(YCP Leaders)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఎపీలో మాత్రమే అమలవుతున్నాయని ఆయన ఆరోపించారు. కొడాలి నానీ (Kodali Nani).. నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), అతని కుటుంబ సభ్యులపై ఎన్ని అయినా వాగొచ్చు..!! నోరేసుకుని మాట్లాడినా..!! వారిపై కేసులు ఉండవు.. అరెస్టు చేయరు. వారి వ్యాఖ్యలను తప్పు బడితే.. తమపై కేసులు పెడతారా.? అని ప్రశ్నించారు. పేర్ని నాని కేసులు పెడితే.. పోలీసులు నమోదు చేశారు. తాను కొడాలి నాని, వంశీని విమర్శిస్తే.. పేర్ని నానికి ఏంటి నొప్పని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. పేర్ని నానీ.. నేను నీ గురించి మాట్లాడితే నీ చెవిలో నుంచి రక్తం కారుతుంది.. గుర్తు పెట్టుకో అంటూ మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..AP Politics: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేని రెండు చట్టాలు ఏపీ అమలవుతున్నాయని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం నిరంతరం ఉండదు ఈ విషయం పోలీసులు గమనించి నడుచుకోవాలన్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏపీలో నిరసనలు చేసేందుకు కూడా ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.
Translate this News: