చంద్రబాబు తప్పు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తప్పు చేసిన కారణంగానే ఎంత మంది సీనియర్ న్యాయవాదులు వాదిస్తున్నా బెయిల్ దొరకలేదన్నారు. చంద్రబాబు 5 కిలోల బరువు తగ్గారని కుటుంబ సభ్యులే అబద్దాలు చెబుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కావాలనే చంద్రబాబు ఆరోగ్యంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని 35 రోజుల నుంచి కోర్టులో ఎందుకు పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎప్పటినుంచో చర్మ సమస్యలు ఉన్నాయన్నారు. ఏ రాష్ట్రంలోనూ ఎవరికీ ఏసీ ఇవ్వలేదు కానీ, చంద్రబాబుకు ఇచ్చారని మంత్రి అన్నారు.
పూర్తిగా చదవండి..AP Politics: చంద్రబాబుకు అందుకే బెయిల్ రావడం లేదు: మంత్రి అంబటి సంచలన వాఖ్యలు
చంద్రబాబు నాయుడు ఆరోగ్యం బాగాలేదని టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు నేరం చేశారు కాబట్టే చట్టం చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబుపై కక్ష పెంచుకోవాల్సిన అవసరం తమకు లేదని అంబటి స్పష్టంచేశారు.
Translate this News: