Telangana Politics: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత బాలసాని.. ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి

హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. ఆదివారం బాలసాని నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసాని లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. బీఆర్ఎస్‌కు బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

New Update
Telangana Politics: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత బాలసాని.. ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ కీలక నేత బాలసాని లక్ష్మీనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ రోజు బాలసాని నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. బాలసానిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నేను సైతం అంటూ తాను వస్తామన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎన్ని లక్షల కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినా.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇది కూడా చదవండి: కొండబాబుపై ద్వారంపూడి సంచలన వాఖ్యలు..అవినీతి చిట్టా బయటపెడతానని హెచ్చరిక

తెలగాణలో యువత మొత్తం మనవైపే చూస్తున్నారని పొంగులేటి అన్నారు. ఆఖరుకు TSPSC కూడా మోసమే అంటూ ఫైర్‌ అయ్యారు. డబ్బు కోసం పేపర్లు లీకు చేసిన ఘనుడు కేసీఆర్‌ అని ఆరోపించారు. అర్హులకు కాకుండా పింక్ షర్ట్ వేసుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువత కలలు కల గానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అన్ని సెక్టార్‌లలో మోసం చేశారని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది.. ఇళ్ల స్థలం తోపాటుగా 5 లక్షలతో ఇల్లు ఇస్తామని పొంగులేటి తెలిపారు. గ్యారెంటీ కార్డుల గ్యారెంటీ కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు.

ఇది కూడా చదవండి: దేశంలో ఎక్కడా లేని చట్టాలు ఏపీలో ఉన్నాయి: బుద్దా వెంకన్న

బాలసాని మట్లాడుతూ.. తనను చాలా సార్లు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానానికి చెప్పుకుంటే పట్టించుకోలేదన్నారు. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానన్నారు. అధికార మదంతో బీఆర్ఎస్‌ నాయకులు ప్రవర్తించడంతోనే తాను రాజీనామా చేశా అన్నారు. మావోయిస్టు ప్రాంతంలో కష్టపడి పనిచేశానన్నారు. ఇప్పటి వరకు సౌమ్యంగా ఉన్నాం. ఇంకా ఉండే ఓపిక లేదని బాలసాని అన్నారు. అధికారులు చిల్లర పనులు మారాలని హెచ్చరించారు. అధికార పార్టీకి తొత్తులుగా ఉండకండని వారికి సూచించారు.

ఇది కూడా చదవండి: చంద్రబాబుకు అందుకే బెయిల్ రావడం లేదు: మంత్రి అంబటి సంచలన వాఖ్యలు

Advertisment
తాజా కథనాలు