/rtv/media/media_files/2025/01/20/Koc02EawlqAyO06Ml2l7.jpg)
Donald Trump family
Trump: ప్రపంచంలో ఏం జరిగినా అగ్రరాజ్యం అమెరికాకు వార్త కాదు. కానీ అమెరికాలో చీమ చిటుక్కుమన్నా ప్రపంచానికి వార్త అవుతుంది. అది అగ్రరాజ్యం కాబట్టి. అలాంటి దేశానికి అధ్యక్షుడు అంటే ఎలా ఉంటుంది? ఆ అరుదైన అవకాశం ఇప్పుడు రెండో సారి డోనాల్డ్ ట్రంప్‌కు దక్కింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేస్తున్న డోనాల్డ్ ట్రంప్ కుటుంబ నేపథ్యం ఏమిటీ? ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
President Trump’s Celebratory Victory Rally https://t.co/MCKNpDh8kG
— Donald J. Trump (@realDonaldTrump) January 19, 2025
ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో వ్యక్తి..
న్యూయార్క్‌లోని క్వీన్స్ మేరీ, ఫ్రెడ్ దంపతులకు జూన్ 14, 1946న డొనాల్డ్ ట్రంప్ జన్మించారు. తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఐదుగురు సంతానంలో ట్రంప్ నాలుగో వ్యక్తి. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్‌లో 1968లో డిగ్రీ పట్టా పొందారు. తండ్రి కంపెనీలో 1971లో బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్‌గా పేరు మార్చారు. హోటల్స్, రిసార్టులు, నిర్మాణ రంగం, క్యాసినోలు, గోల్ఫ్ కోర్స్‌ల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. 2004లో ది అప్రెంటిస్ రియాల్టీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు.
మూడు పెళ్లీలు..
స్పోర్ట్స్ ఉమెన్, మోడల్ ఇవానా జెలింకోవాను తొలుత వివాహం చేసుకున్న ట్రంప్.. 1990లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వారికి ముగ్గురు పిల్లలు జన్మించారు. తర్వాత నటి మార్లా మార్పెల్స్‌ను 1993లో పెళ్లి చేసుకున్న ట్రంప్.. 1999లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. వారికి ఓ కూతురు జన్మించింది. ఆ తర్వాత స్లొవేనియాకు చెందిన మాజీ మోడల్ మెలానియాను 2005లో ట్రంప్ వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం బారన్ విలియమ్ ట్రంప్ అనే కుమారుడు ఉన్నాడు.
ఇది కూడా చదవండి: TG News: మందుబాబులకు మత్తెక్కించే వార్త.. KF మళ్లీ వచ్చేస్తోంది!
అయితే రిపబ్లికన్ పార్టీ తరఫున 2016 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్.. డెమోక్రటిక్ నేత హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి చెందిన ట్రంప్.. 2024లోనూ బరిలోకి దిగారు. డెమోక్రట్ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Meenakshi Chaudhary: ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయాలని ఉంది! ఇది నిజమేనా మీను..?