Pawan Kalyan : నేటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష
AP: ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులు దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు.
AP: ఈరోజు నుంచి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు. మొత్తం 11 రోజులు దీక్ష చేయనున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్పై పరువు నష్టం కేసు నమోదైంది.
రూ.8,888 కోట్లకు టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,516 కొట్లకు టెండర్లు ఇస్తే.. రూ.8,888 కోట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
తిరుమల పవిత్రతకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. లడ్డూ కల్తీ విషయంలో తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలిపెట్టమన్నారు. తప్పు చేయడమే కాక జగన్ ఎదురు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు.
AP: విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు చేపట్టారు. ఈరోజు ఉదయం నుంచే ఈ కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.
నోటీసులు ఇవ్వడం, ఏ ప్రాంగణంలోకి అయినా వెళ్లి పరిశీలించడం తదితర పవర్స్ ను తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ORR లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 51 పంచాయతీలపై హైడ్రాకు హక్కులు కల్పించింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను రెండు రోజుల్లో జారీ చేయాలని కేబినెట్ తీర్మానించింది.
జార్ఖండ్లో రెండు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో జనరల్ గ్రాడ్యుయేట్ లెవల్ కంబైన్డ్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.