Konda Surekha: సురేఖ.. డైనమిక్‌ లీడర్‌ ..ప్రజల కోసం నిలబడే వ్యక్తి

కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్‌ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.

New Update
yasaswini

Konda surekha: వరుస వివాదాల్లో చిక్కుకుని అమోమయంలో ఉన్న మంత్రి కొండా సురేఖకు ఓ యువ మహిళా ఎమ్మెల్యే నుంచి అనూహ్య మద్దతు లభించింది. కొండా సురేఖపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గురువారం నాడు ఎక్స్‌ వేదికగా సంచలన పోస్ట్‌ చేశారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

Also Read:  నిన్ను చంపేస్తాం.. సల్మాన్‌ఖాన్‌కు వార్నింగ్!

కొండా సురేఖ ప్రజల కోసం నిలబడే వ్యక్తి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. హన్మకొండలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌లో తాను కొండా సురేఖని కలిశానని ఆమె ఒక డైనమిక్ లీడర్ అంటూ కొనియాడారు. ప్రజల కోసం విశ్రాంతి లేకుండా పనిచేసి, అభివృద్ధికి బాటలు వేసే నాయకురాలని పేర్కొన్నారు. తన వంటి వారికి కొండా సురేఖ ఓ స్ఫూర్తి అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Also Read: రెండో త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభం.. ఎన్ని కోట్లంటే?

వరుస వివాదాల్లో మంత్రి..


రాష్ట్రంలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ తీరు చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల కిత్రం కేటీఆర్‌, అక్కినేని నాగార్జున కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై సినిమా ఇండస్ర్టీ మొత్తం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నారు.

సీఐ సీట్లో కూర్చొని

ఆ వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఫ్లెక్సీల వివాదం తర్వాత కూడా కొండా సురేఖ తన అనుచరులు కార్యకర్తల జోలికి వస్తే ఉక్కు పాదంతో తొక్కేస్తానని వ్యాఖ్యలు చేశారు. గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ సీట్లో కూర్చొని కొండా సురేఖ మరో వివాదానికి కారణమయ్యారు. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖని వ్యతిరేకిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలు మంత్రి తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 

Also Read: చేత‌కాని ద‌ద్ద‌మ్మ అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందని కొండా సురేఖ పైన ఇప్పటికే పార్టీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్ మున్షీకి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖని మంత్రివర్గం నుంచి తప్పించాలన్న డిమాండ్ కూడా ఆయా ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖపై ఉమ్మడి వరంగల్ జిల్లాకే చెందిన యువ మహిళా ఎమ్మెల్యే మద్దతు పలకుతూ పోస్టు పెట్టడం ఆసక్తికరంగా మారింది. జిల్లాల్లో అసలేం జరుగుతోందన్న చర్చ మొదలైంది.

Also Read: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

 

Advertisment
Advertisment
తాజా కథనాలు