Telangana Cabinet Expansion: సురేఖ ఔట్.. ఆ ఐదుగురు ఇన్!

మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ కు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మరో బీసీకి అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మరో నలుగురికి కూడా మంత్రివర్గంలోకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

New Update
Telangana Cabinet expansion

మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగించడం దాదాపు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఇదే అదునుగా ఆమె రాజకీయ ప్రత్యర్థులు వేగంగా పావులు కదుపుతున్నారు. హైకమాండ్ కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఆమెతో తట్టుకోలేకపోతున్నామంటూ నిన్న రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీని కలిసి మొరపెట్టుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు.. హైకమాండ్ కు సైతం కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో తమను పని చేసుకోనివ్వడం లేదని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. నాగార్జున ఫ్యామిలీ మీద చేసిన కామెంట్లతో ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న హైకమాండ్.. ఈ కొత్త కంప్లైంట్ తో సురేఖ మీద మరింత సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

మరో బీసీకే ఛాన్స్..

అయితే.. బీసీ మహిళ అయిన సురేఖను తప్పిస్తే సమస్యలు కూడా వస్తాయని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరో బీసీకే ఆమె స్థానంలో అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం రేవంత్ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఇప్పుడు నాలుగు మాత్రమే భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తుంది. ఈ నలుగు మంత్రి పదవులతో పాటే సురేఖను తప్పిస్తే ఏర్పడే ఖాళీని సైతం భర్తీ చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. దీంతో సురేఖ అవుట్.. ఐదుగురు ఇన్ అనే చర్చ గాంధీ భవన్ లో జోరుగా సాగుతోంది.  మరో నాలుగు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై కాంగ్రెస్ లో ఉత్కంఠ సాగుతోంది.

ఇది కూడా చదవండి: మూసీ నిర్వాసితులకు మెరుగైన పరిహారం.. సీఎం రేవంత్ ప్రెస్-LIVE

ముదిరాజ్ సామాజికవర్గం నుంచి ఒకరు..

ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటామని గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఛాన్స్ పక్కా అన్న ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇప్పటివరకు ఎవరికీ ఛాన్స్ దక్కలేదు. ఆ జిల్లా నుంచి వినోద్, వివేక్, ప్రేమ్ సాగర్ రావులో ఒకరికి అవకాశం దక్కే అవకాశం ఉంది. వీరిలో వివేక్ కు మంత్రి పదవికి కన్ఫామ్ అన్న ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ దక్కుతుందా?

దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం మంత్రి పదవిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఆ జిల్లా నుంచి ఇద్దరు రెడ్డి సమాజికవర్గం నేతలు మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో మరో రెడ్డికి అవకాశం దక్కుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. మాదిగ సామాజికవర్గం నుంచి కూడా ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది.

ఇది కూడా చదవండి: Caste Census: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

Advertisment
Advertisment
తాజా కథనాలు