BREAKING: నీ అంతు చూస్తా అంటూ.. కవితపై సీరియస్ అయిన హరీష్‌ రావు!

కవిత చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల నుంచి పార్టీలో నమ్మకంగా ఉంటే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కవితపై హరీష్ రావు మండిపడ్డారు. అయితే నేడో, రేపో హరీష్ రావు ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. UPDATING..

New Update

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల హరీష్ రావు, సంతోష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ప్రెస్‌మీట్ నిర్వహించి పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి హరీష్ రావు, సంతోష్ రావుపై కవిత విమర్శలు చేశారు. పరోక్షంగా కొంతమంది పార్టీ నాయకులను గుంట నక్కలు, మేకవన్నె పులులు అని అన్నారు. తనను జైలుకు పంపించి, పార్టీలో తన ప్రాధాన్యతను తగ్గించడంలో గుంట నక్కలు పాత్ర ఉందని పరోక్షంగా ఆరోపించారు. అయితే ఈ గుంట నక్కలు అని హరీష్ రావు, సంతోష్ రావులనే పరోక్షంగా కవిత అన్నట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: అందుకేనా నాకు ఈ శిక్ష.. కవిత ఎమోషనల్ ట్వీట్!

నేడు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు..

తనని ఉరితీశారని.. రేపు రామన్నకు కూడా ఇదే ప్రమాదం పొంచి ఉందని కవిత వ్యాఖ్యానించారు. తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి బీఆర్ఎస్‌ను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. నాన్న, అన్న హరీష్ రావు, సంతోష్ రావులతో జాగ్రత్త అని కవిత అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇన్నేళ్ల నుంచి పార్టీలో నమ్మకంగా ఉంటే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని కవితపై హరీష్ రావు మండిపడ్డారు. ప్రస్తుతం హరీష్ రావు లండన్‌లో ఉన్నారు. తన కూతురు కాలేజీ జాయినింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. అయితే నేడో, రేపో తిరిగి వచ్చిన తర్వాత కవిత తనపై చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

ఇది కూడా చూడండి: Vijayaramarao: కవితమ్మా.. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా?.. నిప్పులు చెరిగిన విజయరామారావు!-VIDEO

Advertisment
తాజా కథనాలు